ప్రశాంత్ వర్మ యూనివర్స్ లోకి మహేష్ బాబు.. ఏ పాత్రలోనో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో
 సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ప్రశాంత్ వర్మ ఒకరు . ఈయన అ! అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కల్కి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకున్న ఆ తర్వాత చాలా తక్కువ కాలంలోనే జాంబి రెడ్డి మూవీతో మంచి విజయాన్ని అందుకొని కం బ్యాక్ ఇచ్చాడు. ఈయన దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 

ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి మూవీ అని ఈ యూనివర్స్ నుండి మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి అని కూడా ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ యూనివర్స్ కి సంబంధించిన కొన్ని అప్డేట్లు కూడా వెలువడ్డాయి. ఇక హనుమాన్ సినిమాతో ఈయన క్రేజ్ సూపర్ గా పెరిగిపోయింది. దానితో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలపై మాత్రమే కాకుండా ఈయన కథలను అందించిన సినిమాలపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే ప్రశాంత్ వర్మ తాజాగా మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న దేవకి నందన వాసుదేవ సినిమాకు కథను అందించాడు. 

నవంబర్ 14 వ తేదీన ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు నటించినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఈ సినిమా క్లైమాక్స్ లో కనిపించబోతున్నట్లు , ఇక ఏకంగా మహేష్ ఈ మూవీ లో శ్రీ కృష్ణుడి పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే మహేష్ అభిమానులకు ఇది ఫుల్ జోష్ నింపే న్యూస్ అని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు నటిస్తే ఈ మూవీ పై అంచనాలు కూడా తారాస్థాయిలో పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: