ఏంటి ఆ హీరోయిన్ ఏకంగా సోనియాగాంధీ భర్తనే కోరుకుందా..రాజీవ్ గాంధీ తో పెళ్లి చేయమని ఇంట్లో రచ్చరచ్చ చేసిందా.. ఇంతకీ రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకోవాలనుకున్న తెలుగు హీరోయిన్ ఎవరు..ఎందుకు ఆయన అంటే అంత ఇష్టం అనేది ఇప్పుడు చూద్దాం.చాలా మంది సినిమా అమ్మాయిలకి సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలంటేనే ఇష్టం అని అనుకుంటారు. కానీ కొంతమంది క్రికెటర్లు, వ్యాపారవేత్తలు,రాజకీయ నాయకులు కూడా ఇష్టపడతారు. అలా చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు సినీ ఇండస్ట్రీకి చెందిన వారే కాకుండా రాజకీయ నాయకులను,బిజినెస్ మాన్లను, క్రికెటర్లను పెళ్లి చేసుకున్న వాళ్లు ఉన్నారు. అయితే అలాంటి కోవకే చెందుతుంది ఈ హీరోయిన్. కానీ పెళ్లయితే చేసుకోలేదు.మరి ఇంతకీ రాజీవ్ గాంధీని అంతలా ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకోవాలి అనుకున్న హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ నటి రాశి. అవును మీరు వినేది నిజమే. రాశికి దివంగత రాజకీయ నాయకుడు రాజీవ్ గాంధీ అంటే చెప్పలేనంత ఇష్టమట. అయితే ఈ ప్రేమ పుట్టింది కూడా పేపర్ లో వచ్చిన ఫోటో చూసే పుట్టిందట.. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అనే విషయం తెలియని రాశి అమాయకత్వంతో ఓరోజు పేపర్లో ఆయన ఫోటో చూసి అబ్బ ఈయన ఎంత అందంగా ఉన్నాడు.. చేసుకుంటే ఈయననే పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయిందట. ఇక ఇంటికి వెళ్లి రాజీవ్ గాంధీ ఫోటో చూపెట్టి మరీ నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈయననే చేసుకుంటాను మీరు ఏమైనా చేసుకోండి అంటూ రచ్చ రచ్చ చేసిందట.
అయితే ఈ విషయంలో ఫ్యామిలీ వాళ్ళు ఎంత సర్ది చెప్పాలని చూసినా కూడా రాశి వెనక్కి తగ్గలేదట.అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే టీనేజ్ నుండి బయటపడ్డాక రాశికి అసలు విషయం తెలిసి వచ్చింది. అయితే రాశి రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకోవాలనుకుంది టీనేజ్ లో ఉన్న సమయంలోనట. ఆ సమయంలో చాలా అమాయకత్వంతో రాశి ఆ మాటలు మాట్లాడేదట.అంతేకాదు పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉన్న రాశి పెళ్లయ్యాక హౌస్ వైఫ్ అవుతాను అని చెప్పుకునేదట.కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి పెద్ద హీరొయిన్ అయింది.అయితే రాజీవ్ గాంధీని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాను అనే విషయాన్ని రాశి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది