స్టార్ హీరోతో మూవీ చేసే ఛాన్స్ ఇచ్చాడు.. కానీ ఆఫర్ నచ్చలేదు.. ఎస్వి కృష్ణారెడ్డి..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగించిన దర్శకులలో ఎస్ వి కృష్ణారెడ్డి ఒకరు. ఈయన తన కెరియర్లో ఎక్కువ శాతం చిన్న హీరోలతో , మీడియం రేంజ్ హీరోలతో సినిమాలను తెరకెక్కించి అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. అలాగే ఎక్కువ శాతం ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలతోనే ఈయన విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఈయన కెరియర్లో బాలకృష్ణతో టాప్ హీరో , నాగార్జునతో వజ్రం అనే సినిమాలను రూపొందించాడు. ఇక స్టార్ హీరోలతో ఈయన రూపొందించిన ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి.

దానితో ఈయన స్టార్ హీరోలను హ్యాండిల్ చేయలేడు అనే వార్తలు కూడా కొన్ని వచ్చాయి. ఇకపోతే తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా మీరు చిరంజీవితో ఎందుకు సినిమా చేయలేదు అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది. దానికి కృష్ణారెడ్డి సమాధానం చెబుతూ ... నేను చిరంజీవితో సినిమా చేయాలి అనుకున్నాను. అందుకోసం రెండు సార్లు ప్రయత్నించాను. ఇక రెండు సార్లు ఆయనకు కథను వినిపించగా ఒక సారి ఆ కథ చాలా అడ్వాన్స్ గా ఉండడంతో అప్పుడు ఆ సినిమాను తీయడం కష్టం అనే ఉద్దేశంతో చిరంజీవి చేయలేదు. ఆ తర్వాత ఒక కథ చెప్పాను. దానికి ఆయన మొదట సానుకూలం గానే స్పందించిన ఆ తర్వాత ఎందుకో స్పందించలేదు. ఇక అశ్విని దత్ ఒకసారి చిరంజీవి తో ఓ సినిమాను స్టార్ట్ చేసాము. కొన్ని పాటలను కూడా తీశాం.

ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆ పాటలను ఉపయోగించుకొని ఏదైనా సినిమా చేస్తారా అని అడిగాడు. నేను అలా చేయను. ఎందుకు అంటే చిరంజీవి తో ఫుల్ గా ఆలోచించి ఒక కథ రాసి చేయాలి. అలా ఏదో కొంత కంటెంట్ ఉంది కదా అని సినిమా చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే అశ్విని దత్ ఆఫర్ ను రిజెక్ట్ చేశాను అని కృష్ణా రెడ్డి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: