ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బన్నీ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. గత కొంత కాలంగా అల్లు అర్జున్ కి మెగా హీరోలకు పాడడం లేదు అని ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. దానికి ప్రధాన కారణం మెగా హీరోలలో ఒకరు అయినటువంటి పవన్ కళ్యాణ్ "జనసేన" అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే. ఇక కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో భాగంగా పవన్ కళ్యాణ్ తన పార్టీ వ్యక్తులను గెలిపించాలి అని ప్రచారాలు చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ మాత్రం నంద్యాలలోని వైసిపి నేతకు సపోర్టుగా అతనిని కలిశాడు.
దానితో అప్పటి నుండే పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ న్యూ టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఇక అప్పటి నుండి అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా వస్తే దానిపై పవన్ అభిమానుల ఎఫెక్ట్ భారీగా పడే అవకాశం ఉంది అని కూడా చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీని డిసెంబర్ ఆరవ తేదీన విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ కేవలం మూడు రోజుల్లోనే ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో ఆ మొత్తాన్ని వెనక్కి తెచ్చే ప్లాన్స్ వేస్తున్నట్టు తెలుస్తుంది.
మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా టికెట్ రేట్లను పెంచేసి ఆ మొత్తాన్ని వెనక్కు తెచ్చుకోవాలి అని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దానితో పవన్ కళ్యాణ్ వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో వారు సినిమాలు చూడకుండా ఉండడం వల్ల కలెక్షన్లు రావని భావిస్తున్నారో వారికి ఇది చాలా పెద్ద దెబ్బ అని అభిప్రాయాన్ని కొంత మంది వినిపిస్తున్నారు. మరి పుష్ప 3 సినిమా ఆ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందా ..? లేక పవన్ అభిమానులు గెలుస్తారా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.