అక్కినేని అవార్డు తీసుకుంటూ మోహన్ బాబుకి పుల్ల పెట్టిన చిరంజీవి.. 17 ఏళ్ల వైరం.?

Pandrala Sravanthi
తాజాగా అక్కినేని కుటుంబం అందరూ కలిసి ఏఎన్ఆర్ జాతీయ అవార్డులను ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఏఎన్నార్ అవార్డు అందుకున్న చిరంజీవి స్టేజ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన మాటలు వింటుంటే పరోక్షంగా మోహన్ బాబుకి చురకలు అంటించారనిపిస్తోంది. మరి ఇంతకీ అక్కినేని అవార్డు తీసుకోవడానికి మోహన్ బాబు కి చురకలు పెట్టడానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఏఎన్ఆర్ జాతీయ అవార్డు చిరంజీవి అమితాబ్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటూ 2007లో నాకు అవార్డు వచ్చిన సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు అలాగే కొంతమంది హర్షించకపోవడం వల్ల నేను ఆ అవార్డు ని బాక్స్ లో పెట్టి నాకు అర్హత ఉన్న సమయంలోనే ఆ అవార్డు నేను తీసుకుంటాను అని చెప్పాను.ఆ రోజు అవార్డు వచ్చినప్పుడు నేను ఇంట్లో గెలిచాను అనుకున్నాను.కానీ కొంతమంది కి ఇష్టం లేకపోవడంతో ఆ అవార్డు వదులుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఇంట గెలవడమే కాదు రచ్చ కూడా గెలిచాను.

 ఏఎన్నార్ లాంటి ఎంతో లెజెండ్రీ నటుడి అవార్డుని అది కూడా అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా నాగార్జున మనస్ఫూర్తిగా ఆహ్వానించగా నేను  ఈ అవార్డు తీసుకోవడం నాకు ఎంతో గర్వంగా ఉంది అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి ఈ మాటలు మాట్లాడడానికి కారణం గతంలో అంటే 17 ఏళ్ల క్రితం వజ్రోత్సవ సమయంలో మోహన్ బాబు చిరంజీవి గురించి మాట్లాడుతూ మా ఇంటికి కొంతమంది వచ్చి మీకు లెజెండరీ అవార్డు ఇస్తామని చెప్పారు. కానీ అసలు మీకు ఈ అవార్డు ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కాలేదు. మీరు లెజెండ్ కాదు.. అలాంటప్పుడు అవార్డు ఇవ్వడం ఎందుకు. అసలు లెజెండరీ అంటే అర్థం ఏమిటో ముందుగా తెలుసుకోవాలి. నేను 500 కు పైగా సినిమాల్లో నటించాను. 40 సినిమాలకు పైగా డైరెక్షన్ చేశాను. అలాగే మొదటిసారి రాజ్యసభకు వెళ్లాను. చాలామందికి ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాను.

ఇవన్నీ లెజెండరీ కావా..  అంటూ మోహన్ బాబు మాట్లాడారు. ఇక ఆయన మాటలకు నొచ్చుకున్న చిరంజీవి నాకు వచ్చిన ఈ అవార్డుని నేను ఓ బాక్స్ లో పెట్టేస్తున్నాను. నాకు అర్హత ఉన్నప్పుడే దాన్ని అందుకుంటాను. ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్స్, హీరోలకు ఈ అవార్డు ఇవ్వండి.నాకు వద్దు నేను నాగార్జున,బాలకృష్ణ, వెంకటేష్ తరానికి చెందిన వాడిని.నన్ను పెద్దవాడిని చేయకండి.ఎప్పుడైతే నేను ఈ అవార్డ్ కి అర్హుడుని అనుకుంటారో అప్పుడే ఇవ్వండి అంటూ ఓ బాక్స్ లో అవార్డును పెట్టి సరెండర్ చేశారు. అలా ఆరోజు జరిగిన అవమానానికి ఈరోజు చిరంజీవి ఏఎన్ఆర్ జాతియ అవార్డు అందుకొని మోహన్ బాబు పై ప్రతీకారం తీర్చుకున్నట్టు అయింది. అంతేకాదు స్టేజ్ పైన చిరు మాట్లాడిన మాటలు మోహన్ బాబుని ఉద్దేశించి అని అందరికీ అర్థమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: