"నీ అబ్బా రేయ్" ..కోపంతో చరణ్ ని బూతులు తిట్టిన స్టార్ హీరోయిన్..ఎందుకంటే..?

Thota Jaya Madhuri
సాధారణంగా బూతు పదాలు అనేటివి రెగ్యులర్ గా వాడము. కానీ ఏ కోపం వచ్చినప్పుడో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనప్పుడో.. ఒకటి లేదా రెండు మాట్లాడేస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం నోరు తెరిస్తే బూతు పదాలు ఒకటేగా వర్షంలా పడిపోతూనే ఉంటాయి . అది వెరే క్యాటగిరి వాళ్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం . సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా పేరు సంపాదించుకున్న వాళ్లు కూడా ఒకానొక సందర్భంలో కోపంలో బూతు లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి . అయితే అప్పుడప్పుడే వచ్చిన ఒక హీరోయిన్ అది కూడా కెరియర్ స్టార్టింగ్ డెబ్యూ మూవీలోనే రామ్ చరణ్ ను బూతులు తిట్టింది. దీనితో మెగా ఫాన్స్ కూడా షాక్ అయిపోయారు . దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..!


రాంచరణ్ ఇండస్ట్రీ లోకి హీరోగా అడుగుపెడుతున్నాడు అని తెలిసిన మెగా ఫాన్స్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు . ఖచ్చితంగా ఆయన ఇండస్ట్రీలో మెగాస్టార్ ను మించి పోయే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటారు అంటూ అప్పుడే మెగా ఫాన్స్ గెస్ చేసేసారు. అనుకున్న విధంగానే రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ అని చెప్పడం కన్నా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి అని చెప్పుకునే స్థాయికి రామ్ చరణ్ ఎదిగిపోయాడు . రామ్ చరణ్ హీరోగా నటించిన ఫస్ట్ సినిమా చిరుత .


పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నేహా  హీరోయిన్గా నటించింది . ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్దిరిపోతుంది . ఎంతలా అంటే మొదట తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఆ తర్వాత ప్రేమాయణం మొదలుపెట్టి రొమాన్స్ లో కెవ్వు కేక అనిపించేసాడు . అయితే ఈ సినిమాలో నేహా  ..చరణ్ ను " నీయబ్బ రేయ్" అని తిట్టాల్సిన ఒక డైలాగ్ ఉంటుంది. పూరీ జగన్నాథ్ సినిమా అంటే ఇలాంటి డైలాగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు .


అయితే కెరియర్ స్టార్టింగ్ డెబ్యూ  సినిమాలోనే అలాంటి బూతులు తిడితే రామ్ చరణ్ ఫాన్స్ మెగాస్టార్ ఫ్యాన్స్ ఎక్కడ తన కెరియర్ డౌన్ చేస్తారో అని భయపడిందట . నో అసలు చెప్పనే చెప్పను అంటూ తెగ మండిపడ్డిందట . పూరి జగన్నాథ్ ఎలాగోలా ఆమె చేత ఆ డైలాగ్ చెప్పించాడు . హైలెట్ ఏంటంటే.. సినిమాలో ఎన్నో డైలాగ్స్ ఉన్నా కూడా ఆమె చెప్పిన ఈ  డైలాగ్ బాగా హిట్ అయింది .బాగా వైరల్ కూడా అయింది. సోషల్ మీడియాలో అప్పట్లో ఈ డైలాగ్ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే.  ఈ మధ్యకాలంలో ఇలాంటి డైలాగ్స్ రావడం లేదు ..అన్ని బూతు పదాలే ..బూతు వీడియోలు.. బూతు మాటలు.. బూతు సీన్స్ . హద్దులు మీరకుండా ఇలాంటి డైలాగ్స్ వాడొచ్చు అంటూ ప్రూవ్ చేశాడు పూరి జగన్నాథ్..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: