నిర్మాతలకు కనక వర్షం కురిపించిన అమ్మోరు సినిమాకు.. సౌందర్య రెమ్యూనరేషన్ మరి అంత తక్కువ..!
సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో సౌందర్య తన నట విశ్వరూపం చూపించిందని కూడా అంటారు. సౌందర్య నటనకు అందరూ ఫిదా కూడా అయ్యారు ఈ సినిమా అప్పట్లో గొప్ప సంచలనం. అప్పటికున్న టెక్నాలజీతో అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు దర్శకుడు కోడి రామకృష్ణ. ఈ సినిమాలో సౌందర్య ప్రధాన పాత్రలో నటించగా.. రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో మెప్పించారు. సౌందర్య నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆమె ఈ సినిమాలో నటించారు అనటం కంటే జీవించారని చెప్పటం ఎక్కువ.
అప్పట్లో ఈ సినిమాలో సౌందర్య నటన చూసి స్టార్ హీరోలు కూడా షాక్ అయ్యారట. అమ్మోరు సినిమా తర్వాత సౌందర్య కెరియర్ కూడా ఎవరు ఊహించని రేంజ్ కు వెళ్ళింది. అయితే ఈ సినిమా అప్పట్లో రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అలాగే ఈ సినిమా వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది.. అప్పట్లో రెండు కోట్ల బడ్జెట్ అంటే ఇప్పుడు దాదాపు 60 కోట్లకు సమానం. అయితే ఈ సినిమా కోసం సౌందర్య తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు కోట్ల బడ్జెట్ తో తెరికెక్కిన ఈ సినిమా అప్పట్లో 10 కోట్లకు పైగా కలెక్షన్ రాబడింది . అయితే ఈ సినిమాకు సౌందర్య కేవలం అప్పట్లో 45000 మాత్రమే రెమ్యూనరేషన్ గా ఇచ్చారట. తర్వాత సినిమా హిట్ అయి లాభాలు వచ్చిన తర్వాత మరో లక్ష రూపాయలుఇవ్వాలనుకున్నారట. కానీ సౌందర్య వద్దు అని చెప్పారట.. ఈ సినిమా ఆఫర్ ఇవ్వటమే పెద్ద గిఫ్ట్ అని సౌందర్య అప్పట్లో అన్నారని అంటారు .