బ్రేకింగ్: నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి డేట్ వచ్చేసిందోచ్..ఆ స్పెషల్ డే నాడే..!
కేవలం నాగచైతన్య ఫ్యామిలీ అదే విధంగా శోభిత ధూళిపాళ్ల ఫ్యామిలీ మాత్రమే హాజరైంది. కాగా నిశ్చితార్థం తర్వాత ఫొటోస్ ని షేర్ చేసి త్వరలోనే భార్యాభర్తలను కాబోతున్నాము అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు . కాగా తర్వాత వీళ్ళ పెళ్లికి సంబంధించిన డేట్ ని ఎప్పుడు అనౌన్స్ చేయకపోవడంతో ఫాన్స్ షాక్ అయిపోయారు. దానికి తగ్గట్టే కొండా సురేఖ ..నాగచైతన్య - సమంత విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో వీళ్ళు పెళ్లిని బ్రేకప్ చెప్పుకున్నారా ..? అంటూ కూడా సందేహాలు వ్యక్తం అయ్యాయి .
అయితే ఎవరు ఊహించిన విధంగా శోభిత ధూళిపాళ్ల పసుపు దంచే ఫంక్షన్ కంప్లీట్ అయింది అంటూ చాలా ట్రెడిషనల్ గా ఉన్న ఫొటోస్ షేర్ చేసింది . దీనితో నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరగబోతుంది ..ఏ విధమైన అడ్డంకుల లేకుండా అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతూ వచ్చారు. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో డిసెంబర్ 4వ తేదీ మూడు ముళ్ళు వేయబోతున్నాడు అంటూ తెలుస్తుంది . రీసెంట్ గా జరిగిన అక్కినేని నాగేశ్వర రావు గారి నేషనల్ అవార్డ్ 2024 ఈవెంట్ లో ఈ విష్యం బయటపడ్డింది. అక్కినేని కాంపౌండ్ నుంచి లీకైన సమాచారం ప్రకారం.. డిసెంబర్ రెండవ తేదీ సంగీత్ ..మూడవ తేదీ మెహందీ ..నాలుగవ తేదీ పెళ్లి జరగబోతుందట . అంతేకాదు డిసెంబర్ 10వ తేదీ గ్రాండ్గా హైదరాబాదులో భారీ రిసెప్షన్ ని పెట్టబోతున్నారట. పెళ్లికి చాలా తక్కువ మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారట నాగార్జున. అయితే రిసెప్షన్ కి మాత్రం అటు పొలిటికల్ ఇటు సినీ ఇండస్ట్రీ ఇద్దరికీ సంబంధించిన ప్రముఖులను పిలవబోతున్నారట . ఇదే న్యూస్ ఇప్పుడు ట్రెండీగా మారింది..!