ఒక్కరు కాదు ఇద్దరు కాదు .. ఒకే ఫ్రేమ్లో ముగ్గురు మొనగాళ్లు.. ప్రభాస్ - ఎన్టీఆర్ భారీ స్కెచ్..!
మ్యాన్ ఆఫ్ మస్ ఎన్టీఆర్ , రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరు ఇప్పుడు ఒకే దారిలో వెళ్తున్నారు .. అలాగే ఒకే ఫ్రేమ్లో ముగ్గురు మొనగాళ్లు ను చూడ మంటున్నారు . అలాంటి ఎవరు ఊహించని ఎనిమిదో వింతను చూపించడానికి రెడీ అవుతున్నారు. అది ఒక్క సినిమా మూడు కథలు మూడు పాత్రలతో పెద్ద సాహసమే చేయబోతున్నారు. ఒకే తెరపై ముగ్గురు ఎన్టీఆర్లు ముగ్గురు ప్రభాస్ లు కనిపిస్తే అది పాన్ ఇండియా లెవెల్ లో ఎనిమిదో వింతే కానీ అది జరిగేలాగే ఉంది ఇప్పుడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటించిన దీ రాజా సాబ్ సినిమాలో ప్రభాస్‌ను మారుతి ఏకంగా మూడు డిఫరెంట్ పాత్రలో చూపించబోతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి వచ్చిన పిక్ సంచాలనలు క్రియేట్ చేసిందింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ 70 ఏళ్ల ముసలాడిగా , అలాగే 30 ఏళ్ల కుర్రాడిగా, 50 సంవత్సరాల మధ్య వ్యక్తిగా ఇలా మూడు పాత్రలో కనిపించబోతున్నాడట .
ఇక తాత ఆత్మ పాత్రలో కనిపిస్తే, తండ్రి, కొడుకుల పాత్రలు నార్మల్ గా ఉంటాయట. ఇక సంజయ్ దత్ ది కూడా తాత పాత్రే అయితే, తను అమ్మమ్మ హస్బెండ్ గా కామెడీ రోల్ చేశాడని తెలుస్తోంది . ప్రబాస్ ఫస్ట్ టైం హర్రర్ కామెడీ చేయటం అలాగే, ఫస్ట్ టైం మూడు పాత్రల్లో నటించటం . బాహుబలి లో కూడా తను మూడు పాత్రలో నటించిడు . కాకపోతే తాత పాత్ర గోడమీద ఫోటోకి పరిమితమైతే, తండ్రి వెన్నుపోటుటి గురైన అమరేంద్ర బాహుబలిగా, శివుడి పాత్ర మహేంద్ర బాహుబలిగా చూపించారు . అన్నీ ఒక్కో టైంలైన్ లో వచ్చి పోతాయి కాని, ఒకే సారి ముగ్గురి పాత్రలు వెండితెర మీద కనిపించవు . కాని ఇప్పుడదే జరగబోతోంది. ఫ్యాన్స్ లో పూనకాలకు ఏప్రిల్ 10 ముహుర్తం కుదిరింది . ఇక దేవరలో కూడా ఎన్టీఆర్ వేసింది దేవర, వర పాత్రలే అని తెలుసు కాని, మూడో పాత్ర ని కూడా పార్ట్ 2 లో చూపించబోతున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరూ సోలోగా వస్తేనే వెయ్యికోట్ల వస్తున్నాయి. అలాంటిది ఇక మూడు పాత్రలో వస్తే, వెయ్యికోట్ల లెక్కలు కేవలం వందకోట్లతో సమానంగా మారే ఛాన్స్ ఉందిని కూడా అంటూన్నరు.