Jr. ఎన్టీఆర్ ని గెలికిన శ్రియా.. డబ్బులు ఇవ్వలేక ప్రొడ్యూసర్ సూసైడ్..?

Pandrala Sravanthi
 ఎవరైనా  తమ అభిమాన హీరో ఫ్యాన్స్ ని గెలికితే అస్సలు ఊరుకోరు.. అలాంటిది ఈ హీరోయిన్ ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నే గెలికింది.మరి ఇంతకీ శ్రీయా జూనియర్ ఎన్టీఆర్ పై ఎందుకు అలాంటి కామెంట్లు చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.. జూనియర్ ఎన్టీఆర్ శ్రియా కాంబోలో నా అల్లుడు సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో శ్రియా తో పాటు జెనీలియా కూడా హీరోయిన్గా చేసింది. అలాగే శ్రీయా జెనీలియాకి తల్లి పాత్రలో ఎన్టీఆర్ కి అత్త పాత్రలో నటి రమ్యకృష్ణ చేసింది.అలా ఎన్నో అంచనాల మధ్య నా అల్లుడు సినిమా వచ్చి అంతగా హిట్ అవ్వలేదు. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రియా మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే ఆ ఇంటర్వ్యూలో శ్రీయా మాట్లాడుతూ.. నేను ఎన్టీఆర్ తో నా అల్లుడు సినిమాలో నటించాను. ఈ సినిమాలో నాతో పాటు జెనీలియా కూడా చేసింది.

అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక ప్రొడ్యూసర్ అందరికీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. అలా టెక్నీషియన్స్,డైరెక్టర్,అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్టిస్టులు ఇలా ప్రతి ఒక్కరికి వాళ్లకి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్లు అప్పజెప్పారు.ఇక మరికొంతమందికి రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఆ ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు చాలు లేదు. దాంతో ఏం చేయాలో తెలియని ఆ నిర్మాత ఓ రోజు కొలను దగ్గరికి వెళ్లి అందులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. కానీ అక్కడే ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు ఆ ప్రొడ్యూసర్ ప్రాణాలని కాపాడారు. ఒకవేళ వాళ్ళు లేకపోతే ఆ ప్రొడ్యూసర్ ఆరోజే చనిపోయేవారు. అయితే ఈ విషయం తెలిసి నేను నా అల్లుడు సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ వెనక్కి తిరిగి ఇచ్చేసాను అంటూ శ్రియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

 అయితే ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ అంటే మీరు పరోక్షంగా ఎన్టీఆర్ ని ఉద్దేశించి మాట్లాడారా.. మీ మాటలు ఎన్టీఆర్ ని అవమానించినట్లుగానే ఉన్నాయి.. మీరేదో పెద్ద రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసారు ఎన్టీఆర్ మాత్రం ఆ విషయం తెలిసి కూడా రెమ్యూనరేషన్ తీసుకున్నారు అంటూ పరోక్షంగా ఆయన్ని ఉద్దేశించి మాట్లాడారు.. అంటూ షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఎన్టీఆర్ అంటే పడని వాళ్లు శ్రియా కి సపోర్ట్ చేస్తూ అవును మీరు చెప్పింది నిజమే. కొంత మంది హీరోలు ప్రొడ్యూసర్లు బడ్జెట్ విషయంలో ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తగ్గించుకోరు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ శ్రియా మాట్లాడిన మాటలు మాత్రం ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా హర్ట్ చేశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: