ఆ హీరోయిన్ తో అక్కినేని సుమంత్ రెండో పెళ్లి.. నిజమేనా.?

Pandrala Sravanthi
అక్కినేని కుటుంబంలో ఏఎన్ఆర్ నట వారసులుగా ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో నాగార్జున  పెద్ద స్టార్ అయ్యారు తప్ప మిగతా ఏ హీరో కూడా అంతటి స్థాయికి రావడం లేదు. అక్కినేని అఖిల్, నాగచైతన్య,సుమంత్ ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన  సరైన స్టార్డం మాత్రం పడడం లేదు. ఇక నాగచైతన్య అయితే అటు ఇటుగా దూసుకుపోతున్న కానీ అఖిల్,సుమంత్ ల పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది..  కేవలం వీరు సినిమాల్లోనే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. అయితే సుమంత్  భార్యకు విడాకులు ఇచ్చాక మరో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సుమంత్ తనతో నటించిన ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం కోసమే తన భార్య కీర్తి రెడ్డికి విడాకులు ఇచ్చారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే కమలినీ ముఖర్జీ. వీరిద్దరి కాంబినేషన్లో గోదావరి,క్లాస్ మేట్స్  అనే మూవీస్ వచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య కాస్త సాన్నిహిత్యం పెరిగిందట. ఇద్దరు చాలా చనువుగా ఉండడంతో అది కీర్తి  రెడ్డికి తెలిసి మందలించిందట. కానీ సుమంత్ మాత్రం అదంతా షూటింగులో భాగం మాత్రమే అలాంటిది మా మధ్య ఏమీ లేదని చెప్పుకుంటూ వచ్చారట. కానీ కీర్తి రెడ్డి ఆయన మాటలు నమ్మలేదట.ఈ సినిమా విడుదలయ్యే సమయానికి వీరి మధ్య గొడవలు చాలా దారుణంగా పెరిగిపోయాయట. 

దీంతో సుమంత్ ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకొని ఇద్దరు ఇష్ట ప్రకారమే విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే వీరి విడాకుల సమయంలో కూడా కమలినీ వల్లే విడాకులు తీసుకున్నారని అనేక వార్తలు వినిపించాయి. అప్పట్లో మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. సుమంత్ కమలిని ముఖర్జీని రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే  వార్త నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఈ వార్త అప్పట్లో ఇండస్ట్రీలో తెగ వైరల్ అయింది కానీ ఆ వార్త ఇప్పటికి కూడా నిజమవ్వలేదు. ఎందుకంటే కమలినీ ముఖర్జీ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది సుమంత్ మాత్రం ఎవర్ని పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: