నందమూరి
బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో ఆన్ స్టాపబుల్ అనే టాక్ షో ప్రసారం అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షో కి సంబంధించిన మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. తాజాగా ఈ టాక్ షో కి సంబంధించిన నాలుగవ సీజన్ ప్రారంభం అయింది. ఇక ఇప్పటికే ఈ టాక్ షో నాలుగవ సీజన్ మొదటి
ఎపిసోడ్ కు ప్రస్తుత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ప్రస్తుతం ఈ
ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ సీజన్ లోని రెండవ
ఎపిసోడ్ కు లక్కీ
భాస్కర్ మూవీ యూనిట్ విచ్చేశారు. తాజాగా ఈ
ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ను కూడా ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ వారు విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ సీజన్లో ఒక
ఎపిసోడ్ కు
అల్లు అర్జున్ కూడా గెస్ట్ గా రాబోతున్నాడు. ఇప్పటికే
అల్లు అర్జున్ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ
ఎపిసోడ్ కు సంబంధించిన ఎడిటింగ్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం
నవంబర్ నెలలో బన్నీవ్కి సంబంధించిన
ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేసే నుంచే ఆలోచనలో ఆహా బృందం వారు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఎపిసోడ్లో
బాలయ్య ,
అల్లు అర్జున్ ను అనేక ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగినట్లు , ఆయన కూడా అంతే ఇంట్రెస్టింగ్ జవాబులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ
ఎపిసోడ్ గురించి
బాలయ్య ,
బన్నీ అభిమానులు మాత్రమే కాకుండా అనేక మంది సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ
ఎపిసోడ్ నవంబర్ నెలలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.