అల్లు అర్జున్ పారితోషికం పై షాకింగ్ న్యూస్ !
ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీలో అల్లు అర్జున్ నటించినందుకు అతని వాటాకు 270 కోట్లు ఈమూవీ బిజినెస్ లో అతడి షేర్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈవార్తలే నిజం అయితే దక్షిణ భారత సినిమా రంగానికి సంబంధించి అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా బన్నీ ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు.
ఈపరిస్థితులు ఇలా ఉండగా ప్రస్తుతం హైదరాబాద్ లో ఫంక్షన్స్ నిర్వహణ పై నవంబర్ 28 వరకు ఆంక్షలు ప్రభుత్వం విధించిన నేపధ్యంలో భారీ స్థాయిలో నిర్వహించాలి అని తలపెడుతున్న ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగకపోవచ్చు అన్న లీకులు వస్తున్నాయి. దీనితో ఈమూవీని ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే డిసెంబర్ లో విడుదల చేస్తారా లేదంటే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం విజయవాడ తిరుపతి పట్టణాలలో ఏదోఒక పట్టణాన్ని ఎంచుకుని ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీస్థాయిలో బహిరంగ ప్రదేశంలో నిర్వహిస్తారా అన్న విషయామై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే ‘దీపావళి’ తరువాత ఈమూవీకి సంబంధించిన ఐటమ్ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేసి ఈమూవీ ప్రమోషన్ కోసం ఈమూవీలోని కీలక యూనిట్ సభ్యులు అంతా ఉత్తరాది ప్రాంతంలోని ప్రధాన నగరాలు పర్యటించి ఆతరువాత దక్షిణాదికి సంబంధించిన చెన్నై బెంగుళూరు హైదరాబాద్ విశాఖపట్టణం ప్రాంతాలలో అల్లు అర్జున్ సుకుమార్ ల ప్రమోషన్ కార్యక్రమాలు ఉంటాయి అని అంటున్నారు. ఏదోవిధంగా ఈమూవీకి సంబంధించి 2000 కోట్ల కలక్షన్స్ టార్గెట్ గా ‘పుష్ప 2’ టీమ్ అడుగులు వేస్తోంది. జాతీయస్థాయిలో కూడ ఈమూవీకి ఎటువంటి పోటీ లేకపోవడంతో ‘పుష్ప 2’ తాను అనుకున్న టార్గెట్ అందుకోవడం చాల సులువు అంటు మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..