యాక్టింగ్ తో ఉతికారేసిన మురళి శర్మ.. మహేష్ ని మించేలా.. అతిథి సినిమాలో నమ్మలేని నిజాలు..?
- మహేష్ బాబును మించిన నటన..
ఒకప్పుడు సినిమాల్లో విలన్ అంటే తప్పనిసరిగా ముఖంపై ఒక పులిపిరి, పెద్ద పెద్ద మీసాలు, భారీ పర్సనాలిటీ, పెద్ద జుట్టు ఇలా చూడడానికే ఫేస్ చాలా భయం వేసే విధంగా ఉండేవారు. అలా పూర్వకాలం ప్రతి సినిమాలో విలన్ అంటే ఎవరికి నచ్చని పాత్ర. విలన్ ఉన్నాడు అంటే తప్పనిసరిగా హీరో కుటుంబానికి అన్యాయం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చూపించేవారు. ఆ కాలంలో విలన్లంతా కనీసం ప్రజలకు నచ్చేవారు కాదు. విలన్ ల వల్లే హీరోలు పెద్ద స్టార్లుగా ఎదిగేవారు. అలా విలన్లు సినిమాల్లో యాక్టింగ్ చేసి బయట ఎప్పుడైనా కనబడితే ప్రజలు వారిని తిట్టేవారు కొన్ని సందర్భాల్లో చేయి కూడా చేసుకున్నారు.. అలాంటి విలనిజం ప్రస్తుత జనరేషన్ సినిమాల్లో మారిపోయింది. హీరోలను డామినేట్ చేసే విధంగా విలన్లు ఉంటున్నారు. అలాంటివారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మురళి శర్మ. అతిథి మూవీలో తన నటనతో అదరగొట్టేశారు. ఇందులో మహేష్ బాబు నటన కంటే మురళీ శర్మ నటనకే ఎక్కువ మార్కులు పడ్డాయి. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా..
మురళీ శర్మ యాక్టింగ్ అదుర్స్!
మురళీ శర్మ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి. కానీ వాళ్ళ నాన్నగారు వ్యాపారరీత్య ముంబై వెళ్లి స్థిరపడడంతో అక్కడే పెరిగాడు. అయితే ఆయన చదువుకునే రోజుల్లోనే నాటకాల రంగంలో ప్రవేశించి డిగ్రీ అయ్యాక పలు ఉద్యోగాలు చేశాడు. కానీ ఏ ఉద్యోగంలో కూడా నెలకు మించి చేయలేదు. ఆయనకు నటనపై ఉండే ఆసక్తితో చివరికి రోషన్ తనేజా ఇనిస్టిట్యూట్లో చేరి అక్కడ శిక్షణ పూర్తయ్యాక పలు టీవీ సీరియల్స్ లో నటించాడు. ఆ తర్వాత హిందీ చిత్రం రాజ్ లో మొదటి అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సినిమాలో మురళీ శర్మ నటన చూసి ఎంతగానో మెచ్చినటువంటి దర్శకుడు సురేందర్ రెడ్డి మురళి శర్మ ని పిలిపించి మొదటిసారి తెలుగులో అతిధి సినిమాలో అవకాశం ఇచ్చాడు. అలా ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. మొదటిసారి తెలుగులో నటించిన ఆయన నటన మాత్రం అందరి మదిలో మెరిసింది. ఇందులో పోలీస్ విలన్ పాత్రలో చేసి అదరగొట్టాడని చెప్పవచ్చు. కానీ ఈ సినిమాలో మహేష్ బాబును మించిన యాక్టింగ్ కనబడుతుంది. వాస్తవానికి హీరోను హైలైట్ చేసి ఏ చిత్రంలో అయినా చూపిస్తారు. కానీ ఈ సినిమాలో హీరో కంటే విలన్ పాత్రే హైలైట్ అయిపోయింది. ఈ విధంగా మహేష్ బాబును డామినేట్ చేసిన ప్రతి నాయకుడి పాత్రలో మురళీ శర్మ అదరగొట్టాడని చెప్పవచ్చు. ఈ మూవీ తర్వాత ఆయన వందలాది చిత్రాల్లో తండ్రిగా..మామగా.. ప్రతి నాయకుడిగా..ఇలా రకరకాల పాత్రలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.