నాగచైతన్య-శోభిత ధూళిపాళ త్వరలో వివాహ బంధంతో ఒకటి కానున్నారు. ఎంగేజ్ మెంట్ తర్వాత పెళ్లి ఎప్పుడు ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముహూర్తం కూడా పెట్టేసినట్లు తెలుస్తోంది. వైజాగ్ లోనే శోభిత తల్లిదండ్రులుంటున్నారు. ఇక్కడ పెళ్లికి ముందు జరిగే పసుపు దంచే కార్యక్రమం ముగించినట్లు తెలుస్తోంది. అనంతరం అదే రోజు సాయంత్రం శోభిత ముంబైకి వెళ్లిపోయింది.పెళ్లికి అంతా రెడీ అన్నట్లే కెమెరాలకు ఓ సిగ్నల్ ఇచ్చింది. పసుపు దంచడం…శోభిత సిగ్నల్ రెండింట ఆధారంగా ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చేది కార్తీక మాసం అది కూడా పెళ్లిళకు మంచి సీజన్. కాబట్టి ఈ సీజన్ లో చైతన్య-శోభితల పెళ్లి తేది ఫిక్స్ చేసి ఉండొచ్చు. ఆ సంగతి పక్కన పెడితే వారి పెళ్లి తర్వాత కొత్త జంట కాపురం ఎక్కడ పెడుతుంది? అన్నది ఇప్పుడు అంతా ఆలోచిస్తున్నారు.ఈ నేపథ్యంలో శోభిత ఎక్కువగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంటుంది కాబట్టి ముంబయిలో ఇల్లు కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటోంది.
సినిమా అవకాశాలు కూడా ఎక్కువగా బాలీవుడ్ నుంచే వస్తుంటాయి కాబట్టి నాగచైతన్యతో వివాహమైన తర్వాత ముంబయిలో ఉందామనుకుంటోంది. ఇదే విషయాన్ని నాగచైతన్యతో చెప్పగా అతను కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సమంత, తాను కలిసివున్న ఫ్లాట్ లో ఉందామని శోభితతో నాగచైతన్య చెప్పినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. ఆ ఫ్లాట్ లో ఉంటే మాజీ భార్యకు సంబంధించిన జ్ఞాపకాలే వస్తుంటాయని, అక్కడ వద్దని చెప్పేసింది.తాజాగా ముంబయిలో కాపురం పెట్టడానికి నాగచైతన్య కూడా ఒప్పుకోవడంతో నాగార్జున-అమకు గట్టి షాక్ ఇచ్చినట్లైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పెళ్లి అవకముందే విడిగా, అందులోను హైదరాబాద్ కాకుండా ముంబయిలో ఉందామనే శోభిత నిర్ణయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య కూడా అంగీకరించాడు కాబట్టి వారేమీ మాట్లాడలేదు.
సినిమా షూటింగ్ ల కోసం శోభిత హైదరాబాద్ నుంచి ముంబయి తిరగడంకన్నా నాగచైతన్య ముంబయి నుంచి హైదరాబాద్ తిరగడం బెటర్ అనే అభిప్రాయానికి కాబోయే భార్యాభర్తలిద్దరూ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ పెద్దలు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ముంబయికి వెళితే నాగచైతన్య అక్కినేని కుటుంబానికి దూరమైనట్లేనని ప్రచారం నడుస్తోంది. అయితే ఇదంతా వట్టి రూమర్ అంటూ అక్కినేని అభిమానులు కొట్టిపారేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇది కొంచె కష్టమే అంటున్నారు పెద్దలు.టఫ్ మరి వారిద్దరూ కొత్త కాపురం ఎక్కడ అన్నది మాత్రం త్వరలోనే తెలియనుంది.