ప్రభాస్ పెళ్లిపై అప్పుడే హింట్ ఇచ్చాడా.. ఎవరికి తెలియని టాప్ సీక్రెట్ ఇదే..!
ఇవే కాకుండా సలార్ 2 , కల్కి 2 సినిమాలు కూడా రాబోతున్నాయి. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ అభిమానుల్ని వేధిస్తున్న మరో ప్రశ్న ఆయన పెళ్లెప్పుడు చేసుకుంటాడు. అయితే గత కొన్ని రోజులుగా ప్రభాస్ పెళ్లిపై ఎన్నో వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి త్వరలోనే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ హింట్ కూడా ఇస్తుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశాడు. ప్రభాస్ కొందరు అమ్మాయిలతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి.. మీరు అమ్మాయిల హృదయాలను బ్రేక్ చేసే రోజు ఎప్పుడు? అని అడిగింది.
దానర్థం.. మీరు పెళ్లి చేసుకుంటే లేడీ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అవుతుంది. కాబట్టి పెళ్లి ఎప్పుడని అడిగింది. నాకు అమ్మాయిల హృదయాలను బ్రేక్ చేయడం ఇష్టం లేదు. కనుక ఎప్పటికీ బ్రేక్ చేయను అన్నాడు. పరోక్షంగా ప్రభాస్ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పాడు.పెళ్లిపై ప్రభాస్ స్పందించిన మరొక సందర్భం అన్ స్టాపబుల్ షో. బాలయ్య గట్టిగా పట్టుబట్టడంతో అమ్మాయి దొరకడం లేదని ఒక సమాధానం చెప్పాడు. సల్మాన్ పెళ్లి తర్వాతే నా పెళ్లి అని మరో సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. ఇలా ప్రభాస్ తన పెళ్లిపై అప్పుట్లోనే క్లారిటీ ఇచ్చాడు. దిని బట్టి చూసుకుంటే ప్రభాస్ అసలు పెళ్లి చేసుకోడనే అనిపిస్తుంది. ఇక మరి పెద్దమ్మ శ్యామలాదేవి చెప్పినట్టు ప్రభాస్ పెళ్లి జరుగుతుందో లేదో అనేది చూడాలి.