టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి తారక్ తాజాగా దేవర పార్ట్ 1 సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన 33 రోజుల బాక్సాఫీస్ రన్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. ఈ 33 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
33 రోజుల్లో నైజాం ఏరియాలో ఏ సినిమాకు 62.77 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 31.67 కోట్లు , ఉత్తరాంధ్రలో 18.48 కోట్లు , ఈస్ట్ లో 10.68 కోట్లు , వెస్ట్ లో 8.41 కోట్లు , గుంటూరు లో 13.64 కోట్లు , కృష్ణ లో 9.32 కోట్లు , నెల్లూరు లో 6.96 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 33 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 161.93 కోట్ల షేర్ ... 236.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 33 రోజుల్లో ఈ సినిమాకు కర్ణాటకలో 18.20 కోట్ల కలెక్షన్లు దక్కగా , తమిళనాడు లో 4.16 కోట్లు , కేరళ లో 97 లక్షలు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 34.53 కోట్లు , ఓవర్సీస్ లో 36.11 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 33 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 255.90 కోట్ల షేర్ , 447.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 182.25 కోట్ల ప్రి రిలీజ్ బిసినెస్ జరగగా ఈ మూవీ 184 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 71.90 కోట్ల లాభాలను అందుకుంది.