ఈ ముగ్గురు టాప్ హీరోయిన్ల పెళ్లిళ్లు... ఎన్నెన్నో ర‌హ‌స్యాలు....!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
తెలుగు సినిమా రంగంలో మనకు తెలియని చాలా రహస్యాలు మరుగున పడిపోతూ ఉంటాయి. పెద్దపెద్ద హీరోయిన్ల పెళ్లిళ్లు, పిల్లలు.. వారి వివరాలు ఇప్పటికీ ఒక మిస్టరీనిగా నే ఉన్నాయని చెబుతూ ఉంటారు. కొందరు విషయంలో ఇది మరీ సీక్రెట్ గా ఉంటుంది. ప్రతి విషయంలోనూ సినిమా రంగంలో ఏదో ఒక గాసిప్ . .. పుకార్లు బయటికి వస్తూనే ఉంటాయి. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఒక రికార్డు క్రియేట్ చేసిన జయప్రద .. వివాహం ఇప్పటికీ పెద్ద మిస్టరీనే. ఆమె ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుందన్న పుకార్లు కూడా ఉన్నాయి.

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యూపీ కి మకాం మార్చిన జయప్రద.. అక్కడ రాజకీయ ఆగ్రనేతను రాక్షస వివాహం చేసుకుందంటూ అప్పట్లో వినిపించింది. ఇక జయసుధ విషయం కూడా ఇలాగే మిస్టరీగా ఉందని చెబుతూ ఉంటారు. ఆమె తెలుగులో ఓ అగ్ర ద‌ర్శ‌కుడి తో డేటింగ్ చేసిందని పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ఆ దర్శకుడు సినిమాల్లోనే ఆమె ఎక్కువగా నటించడంతోపాటు.. ఆయనకు చేరువుగా ఉంటూ వచ్చిందని టాక్ కూడా అప్పట్లో వినిపించింది.

మరో అగ్ర హీరోయిన్ రాధిక. ఈమెకు మొత్తం మూడు వివాహాలు అయ్యాయి. అయితే ఈ మూడు వివాహాలు కాకుండా మరో పెళ్లి కూడా చాలా సీక్రెట్ గా జరిగిందన్న ప్రచారం ఉంది. రాధిక విషయంలో మూడు పెళ్లిళ్లు చాలా ఓపెన్ గా జరిగాయి. ముందు రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె.. చివరగా సీనియర్ హీరో శరత్ కుమార్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో తమిళ పత్రికలు రాధిక సీక్రెట్ పెళ్లి గురించి కూడా చాలా వార్తలు రాసిన.. రాధిక ఎప్పుడు ఖండించలేదు. ఇలా ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్ల విషయంలో చాలా పుకార్లు షికారులు చేసేవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: