ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా ... రష్మిక మందన ఈ మూవీలో హీరోయిన్గా నటించింది. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలోని నటనకు గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 మూవీ చిత్రీకరణ జరుగుతుంది.
ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ , నాన్ థియేటర్ బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా థియేటర్ , నాన్ థియేటర్ కలిపి 1000 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా యొక్క నార్త్ హక్కులను ఏ ఏ ఫిలిమ్స్ అధినేత అయినటువంటి అనిల్ తడానీ దక్కించుకున్నాడు. ఈయన ఈ సినిమాను నార్త్ ఏరియాలో పెద్ద ఎత్తున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ కి ఉన్న అంచనాల రిత్యా ఈ సినిమాకు నార్త్ ఏరియా నుండి భారీ కలక్షన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా రామ్ చరణ్ "గేమ్ చెంజర్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ సినిమా యొక్క నార్త్ హక్కులను కూడా ఏ ఏ ఫిలిమ్స్ అధినేత అయినటువంటి అనిల్ తాడని దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. మరి గేమ్ చేంజర్ కి కనుక మంచి టాక్ వచ్చినట్లు అయితే పుష్ప పార్ట్ 2 కలెక్షన్లను నార్త్ ఏరియాలో దాటే అవకాశాలు ఉన్నాయి అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే ఇంకా చాలా కాలం వేచి చూడాల్సిందే.