కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ఈ దర్శకుడు ఇప్పుడు ఇద్దరూ స్టార్ హీరోల సినిమాల వలలో చిక్కుకున్నాడు..ఎవరైనా సరే ఏకకాలంలో ఒక పని మీద మాత్రమే పూర్తి కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పనికి తగ్గట్టు మంచి ప్రతిఫలం దక్కుతుంది... అలా కాదని ఒకే సారి రెండు పడవలపై ప్రయాణం చేయాల్సి వస్తే ఆ వ్యక్తికి మానసిక ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది.అందుకే ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు ఆ పని పూర్తయిన తర్వాతనే ఇంకో పని చేయాలి అని అంటూ వుంటారు.. అయితే ఈ విషయంలో మన స్టార్ డైరెక్టర్స్ కాస్త వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు..ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ అటు కమలహాసన్ తో భారతీయుడు -2 ఇటు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమాల షూటింగ్లను ఒకేసారి ప్రారంభించారు. దాని ప్రతిఫలం అటు భారతీయుడు -2 సినిమాపై తీవ్ర ప్రభావం చూపింది.. భారతీయుడు 2 విడుదలై ఘోర పరాభవాన్ని చవిచూసింది. దాంతో ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులలో టెన్షన్ మొదలయ్యింది. డిసెంబర్లోనే విడుదల కావాల్సిన గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు.దీనితో గేమ్ ఛేంజర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.
తాజాగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఇలాంటి తప్పే చేస్తున్నట్లు తెలుస్తుంది..కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ -2 , ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ 31 సినిమా ప్రకటించారు. అంతేకాదు ఎన్ టీ ఆర్ తో సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తిచేసి, 2026 జనవరి 9వ తేదీన విడుదల చేస్తామని రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.ఇలాంటీ పరిస్థితుల్లో ప్రశాంత్ నీల్ అటు సలార్ -2 ఇటు ఎన్టీఆర్ 31 చిత్రాల షూటింగ్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో వరుస ప్లాప్స్ లో వున్న ప్రభాస్ కు సలార్ మంచి ఊరటను ఇచ్చింది.. దీనితో ఫ్యాన్స్ పార్ట్ 2 త్వరగా రావాలని కామెంట్స్ చేస్తున్నారు..దీనితో తాజాగా సలార్ -2 సినిమా పూజా కార్యక్రమాలను డార్లింగ్ బర్త్ డే రోజు నీల్ ప్రారంభించారు...దీనితో సలార్ 2,ఎన్టీఆర్ 31 సినిమాను ఏక కాలంలో పూర్తి చేసేందుకు ప్రశాంత్ నీల్ కష్టపడుతున్నాడు..