దీపావళికి అసలైన అర్ధం చెప్పిన జనతా గ్యారేజ్..!!
భారతీయులు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగలలో దీపావళి పండుగ ఒకటి..ఏ పండుగకు లేని హడావుడి దీపావళి పండుగకు ఉంటుంది.. దీపావళి పండుగ అంటే చిన్న పిల్లలు ఎంతో ఇష్టపడతారు.. పండుగకు వారం రోజులు ముందే వీధిలో టపాసులు కాలుస్తూ చిన్న పిల్లలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు.. అయితే చిన్న పిల్లల దృష్టిలో దీపావళి అంటే టపాసులు కాల్చడం.. కానీ దీపావళికి అర్ధం వేరే వుంది..దీపావళి అంటే దీపాల పండుగ.. దీని అర్ధం చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా అప్పట్లో దీపాలని వెలిగించే వారు.. క్రమంగా ఆ పండుగ దీపావళిగా మారింది.. అయితే దీపావళి పండుగను తరాలు మారే కొద్ది దీపాల పండుగ గా కంటే టపాసుల పండుగగా జరుపుకుంటున్నారు. విపరీతంగా, నిర్వీరామంగా టపాసులు కాలుస్తూ ప్రకృతిని పొల్యూట్ చేస్తున్నారు.. దీపావళి వచ్చిందంటే చాలు మూగ జీవాలు బిక్కు బిక్కుమంటూ బతుకుతాయి.. భయంకరమైన చప్పుల్లు మూగజీవాలకు భయాన్ని కలుగ చేస్తాయి.. దీనికి పరిస్కారం.. ప్రజలలో అవగాహన తేవాలి.. అసలైన దీపావళి అంటే అర్ధం చెప్పాలి..