పండగ వేళ గుడ్ న్యూస్.. ప్రియురాలిని పెళ్లాడబోతున్న అల్లు శిరీష్.?

Pandrala Sravanthi
చాలామంది సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో  ఒక ఇంటి వాళ్ళు అవుతున్నారు. అలా కొంత మంది పెళ్లిళ్లు చేసుకోవడానికి రెడీగా ఉంటే మరి కొంతమంది పెళ్లిళ్లు ఫిక్స్ కూడా చేసుకుంటున్నారు. అయితే తాజాగా అల్లు వారి ఇంట్లో కూడా పెళ్లి భాజాలు మోగబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మరి ఇంతకీ అల్లు వారి ఇంట్లో అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్న  ఆ అమ్మాయి ఎవరు అనేది ఎప్పుడు చూద్దాం.. అల్లు అరవింద్ తనయులుగా ముగ్గురు కొడుకులు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చారు. అందులో పెద్ద కొడుకు నిర్మాతగా రాణిస్తుంటే రెండో కొడుకు స్టార్ హీరోగా అల్లు ఫ్యామిలి పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయేలా చేస్తున్నారు అల్లు అర్జున్.. ఇక మూడో కొడుకు అల్లు శిరీష్ సినిమాల్లోకి హీరోగా వచ్చినప్పటికీ ఈయన కెరియర్ అంతంత మాత్రం గానే ఉంది. 

అయితే ఇప్పటికే ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు జరిగాయి. తాజాగా అల్లు శిరీష్ కూడా పెళ్లికి రెడీ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ హీరోయిన్ తో అల్లు శిరీష్ ప్రేమలో ఉన్నారని,ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు రూమర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.కానీ ఇప్పటివరకైతే ఆ గుడ్ న్యూస్ చెప్పలేదు.అయితే తాజాగా దీపావళి వేళ అల్లు శిరీష్ ఇంట్లో పెళ్ళి భాజాలు మోగబోతున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త ప్రచారం జరుగుతుంది.

అయితే చాలా రోజుల నుండి అల్లు శిరీష్ పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక పోయినప్పటికీ తాజాగా వీరి పెళ్లికి ఓకే చేసినట్టు తెలుస్తోంది. దాంతో త్వరలోనే అల్లు శిరీష్ తన ప్రియురాలితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి మరి చూడాలి అల్లు శిరీష్ పెళ్లి జరగబోతుంది అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: