తమిళ నటుడు విజయ్ తలపతి ఈ మధ్యకాలంలో మొదటిసారి తన పార్టీకి సంబంధించిన భారీ బహిరంగ సభని నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ భారీ బహిరంగ సభకి విజయ్ అభిమానులతో పాటు ఎంతోమంది ఈ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్లు వచ్చారు. దాదాపు ఈ సభకి 8 లక్షల మంది వచ్చినట్టు తెలుస్తోంది.అలా భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో ఈయన మొదటి పార్టీ మీటింగ్ సక్సెస్ అవ్వడంతో చాలామంది ఈయనకి రాజకీయాల్లో తిరుగులేని వారిగా ఎదుగుతారు అని కామెంట్లు పెడుతున్నారు. అయితే అభిమానుల్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉన్నప్పటికీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం ఎన్నో రూమర్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇక విజయ్ తమిళనాడు వెట్రి కజగం పార్టీ భారీ బహిరంగ సభలో సొంత భార్య సంగీత పాల్గొనక పోవడంతో వీరి పర్సనల్ లైఫ్ పై ఎన్నో రూమర్లు మీడియాలో వినిపిస్తున్నాయి.
అయితే ముందే విజయ్ దళపతి పై కోలీవుడ్లో చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. అలాంటిది ఈయన పార్టీ పెట్టాక పార్టీకి మంచి స్పందన వచ్చాక ఈయనపై రూమర్లు పుట్టించకుండా ఉంటారా.. అస్సలు ఉండరు.మరిన్ని రూమర్లు ఈయన వైవాహిక జీవితం పై వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్లో ప్రస్తుతం ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటయ్యా అంటే..విజయ్ సంగీత విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు నిజం కాదు. ఎందుకంటే వాళ్లు మూడు సంవత్సరాల క్రితమే విడాకులు తీసుకొని వేరువేరుగా ఉంటున్నారు. కానీ ఆయన సినీ లైఫ్ ఎక్కడ ఇబ్బందుల్లో పడుతుందేమోనని ఈ విషయాన్ని బయటికి రాకుండా ఇన్ని రోజులు సీక్రెట్ గా ఉంచారని తెలుస్తోంది.
అంతేకాదు ఇన్ని రోజులు సినిమాలే అనుకుంటే ప్రస్తుతం రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. కాబట్టి అటు సినిమాలు ఇటు రాజకీయాల్లో ఆయన సక్సెస్ అవ్వాలంటే పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఎక్కువ విషయాలు బయటకు రానివ్వకూడదు అనే ఉద్దేశంతో తన విడాకుల విషయాన్ని బయటకి రానివ్వడం లేదని తెలుస్తోంది.కానీ మరి కొంతమందేమో ఇవి రూమర్లు అని,విజయ్ సంగీత విడిపోలేదని,కేవలం చిన్నచిన్న మనస్పర్ధలు మాత్రం ఉన్నాయి అని అంటున్నారు. మరి తమిళ మీడియాలో ప్రచారం అవుతున్న విజయ్ సంగీతల విడాకుల వార్తల్లో ఎంత నిజం ఉందో ముందు ముందు తెలుస్తుంది