"లక్కి భాస్కర్" కి అదే బాగా లక్కీగా మారిందా..? ఏం ఛాన్స్ కొట్టావ్ రా బాబు..!

Thota Jaya Madhuri
నేడు దీపావళి సందర్భంగా థియేటర్స్ లో చాలా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ ..కిరణ్ అబ్బవరం నటించిన "క"..సాయి పల్లవి నటించిన అమరన్ మూవీ ..అందరి కన్నా ఎక్కువ అటెన్షన్ గ్రాబ్ చేసింది. కాగా కిరణ్ అబ్బవరం నటించిన "క" సినిమా నెగిటివ్ టాక్ దక్కించుకుంది. అదే విధంగా "అమరన్" సినిమా అదే విధంగా "లక్కీ భాస్కర్" సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు . ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది . భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ సినిమా అసలు అభిమానులకి నచ్చిందా ..? నచ్చలేదా..? ఈ మూవీ రెస్పాన్స్ ఎలా ఉంది..? అసలు మూవీలోని హైలెట్ పాయింట్స్ ఏంటో ..? ఇక్కడ చదివి తెలుసుకుందాం..!


 మలయాళీ నటూడు అయినా తెలుగులో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు దుల్కర్ సల్మాన్ . మరీ ముఖ్యంగా మహానటి , సీతారామం సినిమాలు ఆయనకు ప్లస్ గా మారాయి . ఈ క్రమంలోనే లక్కీ భాస్కర్ సినిమాను యాక్సెప్ట్ చేశాడు . అంతేకాదు ఈ సినిమా మొత్తానికి కూడా ఆయనే కర్త - కర్మ - క్రియగా ఉండడం గమనార్హం. స్టోరీ మొత్తం ముంబైలోని ఒక చిన్న సిటీలో ప్రారంభమవుతుంది. అంతేకాదు 1989 నుంచి 92 మధ్య జరిగిన కథ ఈ లక్కీ భాస్కర్ సినిమా . దుల్కర్ సల్మాన్ మగధ బ్యాంకులో క్యాషియర్గా వ్యవహరిస్తూ ఉంటాడు. అప్పులే తప్ప ఆదాయం ఉండదు. ప్రమోషన్ వస్తే కష్టాలు తీరుతాయని ఆశ పడిపోతూ ఉంటాడు . .


ఈ క్రమంలోనే బ్యాంకులో జరిగే స్కామ్ ల గురించి బయటపడుతుంది . అంతేకాదు ఈ సినిమా 1992లో ముంబైలో జరిగిన హర్షద్ మహత స్కామ్ గురించి తెరకెక్కించినట్లు ఉంది. ఈ స్కాం గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది . దీనిపై గతంలో పలు వెబ్ సిరీస్ కూడా వచ్చాయి .  హర్షద్ మహత్తని బ్యాంకులో పనిచేసే సాధారణ ఎంప్లాయ్ ఎలా బురిడి  కొట్టించాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. బ్యాంక్ లో జరిగే మోసాలు ఎప్పటికప్పుడు చిన్న చిన్న స్కాములు ఎలా ఉంటాయి అనే విషయాన్ని డైరెక్టర్ కళ్లకి కట్టిన్నట్లు చూపించాడు. అయితే ఈ సినిమా మొత్తం కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది . అసలు కథ ఈ సినిమాకి మెయిన్ ప్లస్.  లక్కీ భాస్కర్ లాంటి కథ గతంలో చాలానే చూసినా.. డైరెక్టర్ మాత్రం ఈ  కథను మరింత సరికొత్తగా తెరకెక్కించాడు. లక్కీ భాస్కర్ చూస్తున్నంత సేపు మనకు అదే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది . సిబిఐ వాళ్ళు లక్కీ భాస్కర్ అని అదుపులోకి తీసుకొని బ్యాంకుకు తీసుకువెళ్లి మరి విచారణ ప్రారంభించడంతో అసలు సినిమా ప్రారంభమవుతుంది . సినిమాలో మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కూడా హైలెట్గా మారింది . ఇప్పటివరకు దుల్కర్ సల్మాన్ అంటే మహానటి , సీతారామం సినిమాలు మాత్రమే అనుకున్నాము కానీ ఇప్పుడు మాత్రం దుల్కర్  అనగానే ముందు అందరికీ గుర్తొచ్చేది లక్కీ భాస్కర్ సినిమా . అంతలా డైరెక్టర్ చాలా ఎక్స్క్లూజివ్ గా సీన్స్ తెరకెక్కించారు. ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో సందేహమే లేదు .
లక్కీ భాస్కర్ సినిమాకి కధే మెయిన్ లక్కి గా మారింది . ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమాలో ఏదో స్పెషల్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. అలా సినిమాని  హైలెట్ గా మార్చేసాడు డైరెక్టర్..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: