"అమరన్" సినిమాలో సాయి పల్లవి రోల్ మిస్ చేసుకున్న ఆ అన్ లక్కి హీరోయిన్ ఎవరో తెలుసా..?

Thota Jaya Madhuri
దీపావళి సందర్భంగా నేను థియేటర్స్ లో చాలా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.  అన్ని సినిమాలపై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాలు.  మరీ ముఖ్యంగా అమరన్ సినిమాపై అయితే మాత్రం కోట్లాదిమంది జనాలు చాలా చాలా ఆత్రుతగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  వీర సైనికుడు "ముకుంద్ వరద రాజన్" జీవిత ఆదారంగా ఈ సినిమా తెరకెక్కింది.  ఈ సినిమా కోసం చాలామంది జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అమరాన్ సినిమాపై చాలామంది స్టార్స్ కూడా పాజిటివ్ గా కామెంట్స్ చేయడం గమనార్హం.  కోలీవుడ్ సూపర్ స్టార్ నటుడు శివ కార్తికేయన్ హీరోగా..అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ సాయి పల్లవి జోడిగా నటించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది.


ఎప్పుడెప్పుడు సాయి పల్లవిని ఇందు రెబిక వర్గీస్ పాత్రలో చూస్తామా అంటూ వెయిట్ చేసిన జనాలకు ఆ స్పెషల్ డే రానే వచ్చేసింది. రాజ్ కుమార్ పెరియ స్వామి ఎంతో ఎక్స్క్లూజివ్గా చాలా ఇష్టంగా ఈ సినిమాను తెరకెక్కించారు . రాజ్ కుమార్ పెరియ స్వామి దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సోనీ పిక్చర్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన సినిమానే ఈ అమరన్ . ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.  ఈ సినిమాలోని పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మనకు తెలిసిందే.  మరీ ముఖ్యంగా "మిన్నలే" సాంగ్ అన్నిటికన్నా హైలైట్ గా నిలిచింది .


ఈ పాట ఇప్పటికి యూట్యూబ్లో నెంబర్వన్ గా ట్రెండ్ అవుతుంది.  మొదటి నుంచి సినిమాపై పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదే క్రమంలో సినిమా సూపర్ సూపర్ హిట్ టాక్ అందుకుంది. మరీ ముఖ్యంగా శివకేర్తికేయన్ ఆర్మీ మేజర్ పాత్రలో లీనం అయిపోయినటించాడు. సాయి పల్లవి జీవించేసింది.  సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆమె నటనే .  శివ కార్తికేయన్ - సాయి పల్లవి మధ్య వచ్చిన సీన్స్ సూపర్ డూపర్ గా ఉన్నాయి అని సినిమాను ప్రతి ఒక్కరు కూడా చూసి అప్రిషియేట్ చేయాలి అని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా భారత ఆర్మీకి పర్ఫెక్ట్ ట్రిబ్యూ అని కూడా ఓ నెటిజన్ ట్వీట్ చేయడం గమనార్హం. దేశ సైనికుల ధైర్య సాహసాలను తెరపై చక్కగా దర్శకుడు ఆవిష్కరించారు అని  చాలా చాలా ప్రశంసిస్తున్నారు జనాలు.


 కాగా నిజానికి శివ కార్తికేయన్  సినిమాలో హీరోయిన్గా నయనతారను అనుకున్నారట డైరెక్టర్. ఇందూ రెబిక వర్గీస్ పాత్రలో నయనతార అయితే బాగా నటిస్తుంది అంటూ ఆశపడ్డారట . కానీ ఆమెకు ఈ రోల్ ని వివరించగా ఆమె కొన్ని కారణాల చేత ఈ రోల్ ని రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత ఈ రోల్ కోసం చాలామంది కోలీవుడ్ హీరోయిన్స్ అనుకున్నారట . కానీ ఫైనల్లీ సాయి పల్లవి అయితే బాగుంటుంది అంటూ ఆమెను సజెస్ట్ చేశారట పెద్ద వ్యక్తులు. ఆమెకు కథ వినిపించగానే స్పాట్లోనే అగ్రిమెంట్ పై సైన్ చేసిందట . సాయి పల్లవి ఆ పాత్రకు ప్రాణం పోసింది అని ..ఆమె నిజంగా ఈ సినిమాలో జీవించి నటించేసింది అని పొగిడేస్తున్నారు. సినిమా హిట్ అవ్వడానికి సాయి పల్లవి నటన కూడా ప్రధాన కారణం అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఫస్ట్ డే సినిమా ఎటువంటి కలెక్షన్స్ సాధిస్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: