ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ కొత్త ప్లానింగ్.. ఈసారి థియేటర్లో పగిలిపోతాయి గా..!
ఇక కే జి ఎఫ్ మొదటి భాగం చూసినప్పుడు ప్రేక్షకులకు ఆ థీమ్ కొంచెం కొత్తగా అనిపించింది. కానీ ప్రభాస్ సలార్ చూసే టైం కి జనాలకు అది కొంత ఇబ్బందిగా అనిపించింది. అలాగే బ్లాక్ థీమ్ కొంచెం బాగోదు అయినట్టు ఫీలింగ్ కూడా వచ్చింది. ఇక ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోల ఎలివేషన్లు యాక్షన్ ఘట్టాలు, ఎడిటింగ్ ప్యాటర్న్స్ కూడా అంతా ఒకే స్థాయిలో ఉంటాయి .. దీని కారణంగా కూడా ఆయన సినిమాలన్నీ ఒకరకంగా నడుస్తున్న ఫీలింగ్ మనకు వస్తుంది. దీంతో ఆయన తర్వాత సినిమాని మాత్రం కొంచెం డిఫరెంట్ గా చూపించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది .
మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ తో చేయబోయే తన తర్వాతి సినిమాకు సంబంధించిన కథ నేపథ్యాన్ని ప్రశాంత్ మార్చబోతున్నాడట. అలాగే ఈ సినిమాలు చూపించే విజువల్స్ కూడా తన పాత సినిమాలకు భిన్నంగా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాకు బ్లాక్ థీమ్ ను పక్కన పెట్టబోతున్నట్లు యూనిట్ వర్గాల నుంచి సమాచారం అందుతంది.. అలాగే తనను తాను కొత్తగా ఆఫీస్కించుకోవడానికి ప్రశాంత్ ఈ సినిమాలో మరో కొత్త ప్రయత్నం చేయనున్నాడట. ఇంతకు ముందు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఫస్ట్ లో కనిపించిన బ్లాక్ థీమ్ ఈ సినిమాలో ఉండదని అంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ నవంబరు నెలాఖర్లో మొదలు కావచ్చని తెలుస్తోంది. కానీ తారక్ వెంటనే షూటింగ్కు హాజరు కాడట. ప్రస్తుతం తారక్ వార్-2 షూట్లో బిజీగా ఉన్నాడు. అతను జనవరి నుంచి ప్రశాంత్ సినిమాకు అందుబాటులోకి వస్తాడని సమాచారం. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లో నిర్మించనుంది. రిలీజ్ 2026 సంక్రాంతికి ఉండొచ్చు.