ఏంటి ఆ హీరోయిన్ ని మెగా ఫ్యామిలీ మొత్తం నిలువునా ముంచేసిందా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు మెగా ఫ్యామిలీ చేతిలో ఆ హీరోయిన్ మోసపోయింది అనేది ఇప్పుడు చూద్దాం.. మెగా ఫ్యామిలీ వల్ల మునిగిపోయిన హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ నటి జయసుధ.అయితే మునిగిపోవడం అంటే మీరు అనుకుంటున్నట్లు ఏదేదో చెడు రూమర్స్ అయితే కాదు. ఓ సినమా విషయంలో మెగా ఫ్యామిలీని నమ్ముకొని ఈ హీరోయిన్ నట్టేట మునిగిందట.ఇక ఆ సినిమా ఏదో కాదు హ్యాట్సాఫ్.. హాలీవుడ్ కథని అనుసంధానంగా చేసుకుని తెరకెక్కిన హాట్సాఫ్ మూవీకి శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించగా జయసుధ స్వయంగా కథ సమకూర్చుకొని నిర్మాతగా పనిచేసింది. అలా తను సంపాదించిన డబ్బు మొత్తం ఈ సినిమాకి పెట్టుబడిగా పెట్టిందట జయసుధ.
ఇక ఈ సినిమాలో భారీ తారాగణం ఉండడంతో సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని జయసుధ భావించింది. అలా ఈ సినిమాలో నాగబాబు, సోను సూద్, బ్రహ్మానందం వంటి వారితో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా వరుణ్ తేజ్ కూడా నటించారు. అలాగే ఈ సినిమా చివర్లో జయసుధ భర్తగా అతిధి పాత్రలో చిరంజీవి ఎంట్రీ ఇస్తారు. ఇలా చిరంజీవి ఎంట్రీ సడన్ గా ఉంటుంది. అయితే ఈ సినిమా చిరంజీవికి ఉన్న స్టార్డంతో అయినా హిట్ అవుతుంది అనే ఉద్దేశంతో చిరంజీవి పైన భారం వేసి జయసుధ ఈ మూవీకి భారీ బడ్జెట్ పెట్టిందట.
కానీ సినిమా కథ బాలేక పోతే ఎంతమంది పెద్ద హీరోలు ఉన్నా సినిమా హిట్ అవ్వదు అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీలో ఎంతోమంది భారీ తారాగణం ఉన్నప్పటికీ కథ కంటెంట్ బాగా లేకపోవడంతో సినిమా అట్టర్ ప్లాప్ అయింది. దాంతో మెగా ఫ్యామిలీని నమ్ముకొని జయసుధ రోడ్డున పడింది. ఎందుకంటే ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువ పెట్టడంతో ఒక్క రూపాయి కూడా తిరిగి రాకపోవడంతో ఈమె అప్పుల్లో కూరుకుపోయిందట