ఇండస్ట్రీ లో రికార్డ్స్ అంటూ మొదలైంది మా సినిమాతోనే.. బాలయ్య షాకింగ్ కామెంట్స్..!!
ఆయన గోపాల్ అంటే కృష్ణుడు, నేను బాలకృష్ణుడు. మా మొదటి సినిమా లారీ డ్రైవర్ తో మా ప్రయాణం మొదలైంది... ఆ తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాయి.అసలు ఇండస్ట్రీలో రికార్డులు మొదలయింది మా కాంబోలో వచ్చిన సినిమాలతోనే అని అప్పటివరకు రికార్డులు లే వూ అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు..మా సినిమాలతో మేమే మా రికార్డ్స్ బ్రేక్ చేసుకున్నాము. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే అనే బాలయ్య చెప్పిన డైలాగ్ కి అక్కడ ప్రేక్షకులు గోల చేస్తూ విజిల్స్ వేశారు..అలంపురం జోగులాంబ ఆలయంలో మేము సమరసింహా రెడ్డి క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నాం. అప్పుడు గోపాల్ వచ్చి టైటిల్ గురించి నాతో చెప్పారు. సమరసింహా రెడ్డి అనే టైటిల్ అనుకున్నాము అని అన్నారు. నేను అసలు ఒప్పుకొనేనేమో అని ఆయన అనుకున్నారు. కానీ అమ్మవారి ఆలయంలో చెప్పడంతో అమ్మవారే చెప్పారు అని నేను వెంటనే సరే అన్నట్లు బాలయ్య తెలిపారు...