గబ్బర్ సింగ్: పవన్ కళ్యాణ్ ని చూసి అసూయపడ్డ చిరంజీవి.. కట్ చేస్తే థియేటర్ లో ప్రభంజనం.?
-పవనుడి ఇమేజ్ ఆకాశానికి ఎత్తేసిన మూవీ..
- కొణిదెల పవన్ కళ్యాణ్ నుంచి పవర్ స్టార్ గా మార్పు..
- గబ్బర్ సింగ్ సినిమా వెనుక అసలు కథ ఇదే..
మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఉన్నారు. వారందరి ఫ్యాన్స్ ఒక లెక్క అయితే మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరో లెక్క అనేలా ఉంటారు. ఎందుకంటే జనాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఆ విధంగా ఉంటుంది. కొణిదెల పవన్ కళ్యాణ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తొలిప్రేమ,బద్రి, తమ్ముడు, ఖుషి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన పవన్ కళ్యాణ్ కు ఎంతో పేరు వచ్చింది. ఆ తర్వాత జానీ సినిమా నుంచి దాదాపు పది సంవత్సరాలపాటు పవన్ కళ్యాణ్ కిహిట్లు లేక సతమతమయ్యారు. ఇక ఆయన కెరియర్ ముగుస్తుంది అన్న సమయంలో వచ్చింది ఈ మూవీ. ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే గబ్బర్ సింగ్.. ఈ చిత్రం తర్వాత పవన్ కెరియర్ ఎక్కడికో పోయింది.. అద్భుతమైన హిట్ సాధించి ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ను వరించడం వెనుక ఉన్న కథ ఏంటో చూద్దాం.
ది గ్రేట్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన మూవీ గబ్బర్ సింగ్. ఈ చిత్రం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాకు రీమేక్. అయితే ఈ సినిమా చూసిన తర్వాత పవన్ తెలుగులో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట.. ఇందులో చాలా సినిమాల్లో ఉన్నట్టు తల్లి కొడుకులకు అదే ఉందని కొత్తదనం ఏమీ లేదని పవన్ రిజెక్ట్ చేశారట. కానీ తన అన్న నాగబాబు అప్పులు కట్టడం కోసం ఈ సినిమా చేయవలసి వచ్చిందట. చివరికి సినిమా స్క్రిప్టులో చాలా మార్పులు చేసి మూవీ చేశాడు. ఇందులో అంత్యాక్షరి ఆట కూడా పవన్ సొంతంగా ఇచ్చినటువంటి ఐడియా. ఇదే సినిమాకు హైలెట్ గా నిలిచాయి.. సినిమాలో ఇలియానా, పార్వతి మెల్టన్, నతాలియా కౌర్ లను హీరోయిన్లుగా అనుకున్నారు. చివరికి శృతిహాసన్ ని ఫైనల్ చేశారు.నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అనే డైలాగ్స్ తో దేవిశ్రీ మ్యూజిక్ తో సినిమా అద్భుతంగా తెరకెక్కింది.