ముంబైకి షిఫ్ట్ అయ్యింది అందుకే..ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న సూర్య..!
గత కొద్ది రోజుల క్రితం జ్యోతిక తన అత్తమామలతో గొడవపడి తన భర్తను తీసుకొని ముంబైకి వెళ్లి అక్కడే సెటిల్ అయింది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై సూర్యా తమ్ముడు కార్తీ మాట్లాడుతూ.."మా అన్న, వదిన పిల్లల ఉన్నత చదువుల కోసమే ముంబై వెళ్లారు..తప్ప మా కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవు. మా వదిన దేవత" అంటూ తన వదిన జ్యోతిక గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. అప్పటికి కూడా ఈ రూమర్స్ ఆగలేదు.
అయితే తాజాగా ఈ రూమర్స్ పై స్పందించారు సూర్య. సూర్య మాట్లాడుతూ..' జ్యోతిక నాకోసం తన కెరీర్నే కాదు తన కుటుంబాన్ని కూడా వదిలేసి వచ్చింది. తన సంతోషాలన్నింటినీ కూడా దూరం చేసుకుంది. అందుకే ఇప్పటికైనా తను కోల్పోయినవి అన్నీ తిరిగి కల్పించాలనే ఉద్దేశంతోనే కలిసి ముంబైకి షిఫ్ట్ అయ్యాము. ఆమె సంతోషమే నాకు ప్రధానం అంటూ జ్యోతిక పై ఉన్న ప్రేమను మరొకసారి నిరూపించారు సూర్య. ఏది ఏమైనా సూర్య చేసిన కామెంట్లకు ఇప్పటివరకు ఈ జంటపై వచ్చిన రూమర్స్ అన్నింటికీ పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా క్యూట్ జోడి గానే పేరు తెచ్చుకున్న ఈ జంట ఇప్పుడు పర్ఫెక్ట్ జోడీగా కూడా పేరు సొంతం చేసుకున్నారు.