రాజేంద్రప్రసాద్ విజయ్ చాముండేశ్వరిని పెళ్లి చేసుకున్నారు.అయితే పెళ్లి తర్వాత రాజేంద్రప్రసాద్ జీవితంలో ఎన్నో అనూహ్య సంఘటనలు జరిగాయట.అందులో ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ పై ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోయిన్లు కొన్ని అలికేషన్లు తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే.కానీ వాటన్నింటినీ పట్టించుకోకుండా రాజేంద్రప్రసాద్ భార్య ఆయనకి తోడుగా ఉంటుంది.అయితే ఓ హీరోయిన్ విషయంలో మాత్రం రాజేంద్రప్రసాద్ని టార్చర్ చేసిందట ఆయన భార్య.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు రాజేంద్రప్రసాద్ భార్య ఆ హీరోయిన్ విషయంలో ఎక్కువగా రియాక్ట్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం.రాజేంద్రప్రసాద్ కి కామెడీ హీరో ట్యాగ్ రావడంతో ఈయనతో సినిమా చేయడానికి చాలామంది హీరోయిన్లు ఒప్పుకోకపోయే వారట.కానీ ఆ సమయంలో కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఈయనతో పదేపదే సినిమాల్లో చేసేవారు.
అలా ఒకటికి మించి సినిమాలు చేయడంతో రాజేంద్రప్రసాద్ కి ఆ హీరోయిన్లతో ఎఫైర్ ఉంది అనే వార్తలు కూడా వినిపించాయి. అందులో ఒకరు రజినీ అయితే మరొకరు ఆమని.. ఇక రజినితో అయితే పెళ్లి వరకు వెళ్లినట్టు రాజేంద్రప్రసాద్ పై రూమర్స్ వినిపించాయి.ఇక ఈ విషయం పక్కన పెడితే..నటి ఆమని తో కూడా రాజేంద్రప్రసాద్ చాలా సినిమాల్లో చేశారు. అలా మిస్టర్ పెళ్ళాం, ఎదురింటి పెళ్ళాం పక్కింటి మొగుడు,పచ్చని సంసారం, ఆ నలుగురు వంటి ఎన్నో సినిమాలు చేశారు. అయితే స్క్రీన్ మీద వీరిద్దరి కెమిస్ట్రీ బాగుండడంతో దర్శక నిర్మాతలు కూడా రాజేంద్రప్రసాద్ చేసే చాలా సినిమాల్లో ఆమనిని హీరోయిన్ గా తీసుకునే వారట. అయితే వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసిన ఓ సంస్థ ఏకంగా వీరిద్దరికి బెస్ట్ సిల్వర్ స్క్రీన్ కపుల్ గా సన్మానం చేశారట.
అయితే ఈ సన్మానం అయ్యి ఇంటికి వచ్చాక రాజేంద్రప్రసాద్ కి భార్యతో చాలానే ఇబ్బందులు తలెత్తాయట.అయితే ఈ సన్మానం చూశాక రాజేంద్రప్రసాద్ భార్య ప్రతిరోజు ఇంటికి రావడంతోనే ఓహో బెస్ట్ పెయిర్ ఎలా ఉన్నారు అంటూ మాట్లాడేదట. ఇక భార్య మాటలకు రాజేంద్రప్రసాద్ చాలాసార్లు మనసునొచ్చుకొని లోలోపలే ఏడ్చారట. ఎన్నిసార్లు కూడా రాజేంద్రప్రసాద్ భార్య అలాగే ఎగతాళి చేస్తూ మాట్లాడేదట. ఎందుకంటే హీరోలు హీరోయిన్లతో రొమాన్స్ చేసే సన్నివేశాలు చేశాక ఇంటికి వచ్చాక భార్యలు చేసే పనులు చిత్ర విచిత్రంగా ఉంటాయని ఇప్పటికే ఎంతోమంది హీరోలు కొన్ని ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. అలా రాజేంద్రప్రసాద్ భార్య కూడా ఆమనితో కెమిస్ట్రీ పై ఇంటికి వచ్చాక దెప్పిపొడుస్తూ చాలా రోజులు టార్చర్ చేసిందట