మగధీరతో రికార్డులన్నీ చెరిపేశాడు.. నటనలోనూ చరణ్ కి ప్రశంసలే..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తన నట వారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను చిరుత మూవీతో వెండితెరకు పరిచయం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. చిరుత సినిమాతో మంచి గుర్తింపును చరణ్ తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చరణ్ తన కెరీర్లో రెండవ సినిమాగా మగధీర చేశాడు. అసలు ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టించింది. చరణ్ కు ఎంత గొప్ప పేరును తీసుకువచ్చింది. అసలు ఈ సినిమా స్టార్ట్ కావడానికి ముందు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

చిరంజీవి తన కుమారుడు చరణ్ ను వెండితెరకు పరిచయం చేయాలి అనుకున్న సమయంలో రాజమౌళి అయితేనే అందుకు కరెక్ట్ డైరెక్టర్ అని ఫిక్స్ అయ్యాడట. అందులో భాగంగా అతన్ని సంప్రదించి తన కుమారుడని వెండితెరకు పరిచయం చేయాలి అని అడిగాడట. దానితో రాజమౌళి సార్ నాకు మీ అబ్బాయి తో సినిమా చేయడం ఇష్టమే. కానీ అది మొదటి సినిమాతో పద్దు. ఎందుకు అంటే మీ క్రేజ్ పెద్దది. దానిని మ్యాచ్ చేయాలి అంటే చాలా పర్ఫామెన్స్ చేయాలి. అతని మొదటి సినిమాతో అతనిలో ఎలాంటి టాలెంట్ ఉందో నాకు తెలియదు. రెండవ సినిమాతో నేను చరణ్ తో చేస్తాను అన్నాడట. ఇచ్చిన మాట ప్రకారం చరణ్ రెండవ సినిమా చేయడానికి రాజమౌళి కమిట్ అయ్యాడట. చిరంజీవికి మగధీర కథను రాజమౌళి వినిపించగా ఇది సూపర్ బ్లాక్ బాస్టర్ అవుతుంది ఆది చిరంజీవి కథ వినగానే ఫిక్స్ అయ్యాడట. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. 

ఇక అప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఎవరు ఖర్చు పెట్టని స్థాయిలో ఈ మూవీ కోసం అల్లు అరవింద్ డబ్బులు ఖర్చు చేశాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమంలో ఏ సినిమా వసూలు చేయని కలక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమాలోని చరణ్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. రెండవ సినిమాకే ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ అంటే మామూలు విషయం కాదు ... తండ్రికి తగ్గ తనయుడు అని రెండవ సినిమాతోనే చరణ్ అనిపించుకున్నాడు అనే ప్రశంశలు చరణ్ కి వెల్లువెత్తాయి. ఇక ఈ సినిమాతో చరణ్ స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: