మెగాస్టార్ రేంజ్ ను నిలబెట్టిన 'ఖైదీ'ను మిస్ చేసుకున్న స్టార్ హీరో...అసలేం జరిగిందంటే.!

FARMANULLA SHAIK
మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికి తెలిసిందే. సినీ పరిశ్రమకు సింగిల్ గా వచ్చి కెరీర్ ఆరంభంలో ఎంతో కష్టపడి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, సెకండ్ హీరోగా పలు సినిమాలు చేసి హీరోగా ఎదిగారు. అనంతరం స్టార్ హీరో అయి మెగాస్టార్ గా మారి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే చిరంజీవిని స్టార్ హీరోగా నిలబెట్టింది మాత్రం ఖైదీ సినిమానే.చిరంజీవి, కోదండరామిరెడ్డి టాలీవుడ్‌లో 80వ దశకంలో వీళ్లో ట్రెండ్ సెట్టర్. వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన దాదాపు 80 శాతం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ ‌గా నిలిచాయి. అటు చిరు స్టార్ హీరోగా ఎదగడంలో ఖైదీ సినిమా ముఖ్యపాత్ర పోషించింది. ఆ సినిమా డైరెక్టర్ కోదండరామిరెడ్డి అంటే మెగాభిమానులకు ప్రత్యేక అభిమానం ఉంది.అప్పటి వరకు సాదాసీదా హీరోగా ఉన్న చిరంజీవి.. ఖైదీ విడుదల తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. తెలుగు సినిమాకు సరికొత్త హీరోను అందించింది. తన డాన్స్, ఫైట్స్, యాక్టింగ్‌తో ప్రేక్షకులను సమ్మోహన పరిచారు. చిరంజీవి కెరీర్‌తో పాటు తెలుగు సినిమాల్లో ఖైదీకి ముందు తర్వాత అనేలా తన నటనతో ఆశేష తెలుగు ప్రేక్షకులను అలరించారు. 

ఖైదీ సినిమా చిరంజీవి కెరీర్‌లో తొలి ఇండస్ట్రీ హిట్అ ప్పటి వరకు మాములు హీరోగా ఉన్న చిరంజీవి ఈ సినిమాతో స్టార్‌ హీరోగా దశ తిరిగింది. దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో పరుచూరి బ్రదర్స్ రచనలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంయుక్తా మూవీస్ పతాపంపై ఎమ్.తిరుపతి రెడ్డి సమర్పణలో ధనుంజయ్ రెడ్డి,నరసా రెడ్డి నిర్మించారు. ఈ సినిమాను 1982 జూన్ 16న మద్రాసులోని ప్రసాద్ స్టూడియో మూడో ఫోర్‌లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.ఈ నేపథ్యంలో అసలు ఈ 'ఖైదీ' సూపర్‌స్టార్‌ కృష్ణ చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. దాంతో చిరంజీవికి ఆ అవకాశం దక్కింది.ఇదిలావుండగా ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి, మాధవిలపై సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టడం మరో ముఖ్య విశేషం.ఖైదీ’ సినిమాతో పరుచూరి బ్రదర్స్ స్టార్ రైటర్స్‌గా ఎదిగారు. హీరోగా చిరంజీవికి ఇది 62వ చిత్రం. ఇక ఈ చిత్రంలోని పలు యాక్షన్ సన్నివేశాలను ప్రముఖ హాలీవుడ్ చిత్రం ‘ఫస్ట్ బ్లడ్’ చిత్రం ఆధారంగా తెరకెక్కించారు. అప్పట్లో సినిమా మొదట్లో వచ్చే పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్స్ అప్పటికీ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.అంతేకాదు వినోదపు పన్ను విధానం మారి, శ్లాబ్ సిస్టమ్ వచ్చాకా సినిమా బాగోగులతో సంబంధం లేకుండా థియేటర్లను ఈ సినిమా హౌస్‌ఫుల్ చేసింది. శ్లాబ్ సిస్టంలో ఎక్కువ వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ఖైదీ రికార్డు క్రియేట్ చేసింది. 

ఈ చిత్రానికి చక్రవర్తి అందించిన సంగీతం మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అప్పట్లో ఓ సంచనలం. రూ. 15లక్షల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం పెట్టిన పెట్టుబడికి ఐదింతల లాభాలను తీసుకొచ్చింది. ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్స్‌తో పాటు అందరినీ ఈ సినిమా  లాభాల్లో ముంచెత్తింది. ఈ చిత్రం హైదరాబాద్ శాంతి థియేటర్‌లో 3 ఆటలతో వంద రోజులు నడిచింది. అంతేకాదు మార్నింగ్ షో యేడాది పైగా నడిచి రికార్డు క్రియేట్ చేసింది.పరుచూరి బ్రదర్స్ లో వేంకటేశ్వరరావు ఖైదీ చిత్రానికి 56 సీన్‌లను ఆరు గంటల్లో రాస్తే 3 రోజుల్లో గోపాలకృష్ణ సంభాషణలు పూర్తి చేసారు. ‘ఖైదీ’ చిత్రం చిరంజీవి,దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి కలయిలో వచ్చిన 6వ చిత్రం. ఖైదీతో కోదండరామిరెడ్డి మహిళ దర్శకుడు అనే ముద్ర చెరిపేసుకొని మాస్ దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించాడు.అలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అక్షరాలా 25. తెలుగులో ఒకే కాంబినేషన్ లో వచ్చిన సినిమాల రికార్డును కైవసం చేసుకున్నారు. ఇండస్ట్రీలో స్టార్ డం లేనప్పటి నుంచి ఇద్దరూ ఒకరికి ఒకరు పరిచయం. కష్టాలను చూశారు. కన్నీళ్లను అదుముకున్నారు. అంతటి అనుబంధం ఉన్నా ఎప్పుడూ ఒకరి పరిధులు ఒకరు దాటలేదు. చిరంజీవి రెడ్డిగారూ అని పిలిస్తే కోదండరామిరెడ్డి చిరంజీవి గారూ అని ఇప్పటికీ పిలుచుకుంటారు.అంతటి అనుబంధం ఉన్నా పరస్పర గౌరవానికి చిరంజీవి ఇచ్చే విలువ గురించి గొప్పగా చెబుతారు కోదండరామిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: