టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పి మరీ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తున్న హీరోలు వీళ్లే!

Reddy P Rajasekhar
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ సక్సెస్ రేట్ చాలా తక్కువనే సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం తెలుగులో 150 సినిమాలు విడుదలైతే ఆ సినిమాలలో కేవలం 15 సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలుస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పి మరీ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తున్న హీరోలు ఎవరనే ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్, నాని, కిరణ్ అబ్బవరం పేర్లు సమాధానంగా వినిపిస్తుండటం గమనార్హం.
 
ఈ ముగ్గురు హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలను సాధిస్తూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు. క సినిమా సక్సెస్ తో కిరణ్ అబ్బవరం దశ కూడా తిరిగినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ అబ్బవరం క సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు భారీ స్థాయిలో ఉన్నాయి. నాని సరిపోదా శనివారం సినిమాతో సక్సెస్ అందుకోగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.
 
నాని, జూనియర్ ఎన్టీఆర్, కిరణ్ అబ్బవరం తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించే సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. ఈ హీరోల తర్వాత సినిమాలు కూడా భారీ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఈ హీరోలు కలిసి నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ హీరోల రెమ్యునరేషన్లు సైతం భారీ స్థాయిలో ఉన్నాయి.
 
జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా నాని పారితోషికం 35 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ మాత్రం 3 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. 2025 సంవత్సరంలో సైతం ఈ హీరోలకు భారీ హిట్లు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ముగ్గురు హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: