ఆ స్టార్ హీరో లవ్ లో ఇన్ని ట్విస్టుల.. స్కూల్ నుంచే మొదలు పెట్టేసాడుగా..!
అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్న దుల్కర్ తన లైఫ్ కు సంబంధించిన పళ్ళు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్‌ఫుల్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్ల కంప్లీట్ చేసుకుంది . ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గెస్ట్ గా వచ్చారు . అలాగే రెండో ఎపిసోడ్ కి లక్కీ భాస్కర్ మూవీ టీం సందడి చేసింది . అయితే ఈ ఎపిసోడ్లో దుల్కర్ సల్మాన్‌తో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి , డైరెక్టర్ వెంకీ అట్లూరి , ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా పాల్గొన్నారు . అయితే తాజాగా దీపావళి కానుకగా రెండో ఎపిసోడ్ ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది .. ఇక అందులో దుల్కర్ తన ప్రేమ కథను రివిల్ చేశాడు. అమల్ సుఫియా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్..
ఇక “తను నా స్కూల్ జూనియర్. నేను 12వ తరగతిలో ఉన్నప్పుడు తను 8వ తరగతి. ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్లం కాదు . కానీ అప్పుడప్పుడు తనను చెన్నైలో థియేటర్స్, రెస్టారెంట్స్ లో చూసేవాడని. పరిచయం అంతేకానీ ఎక్కువగా మాట్లాడుకోలేదు. ఇంట్లో సంబంధాలు చూస్తున్న సమయంలో నేను ఆమెకు ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టాను . ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు . మీ ఇంట్లో కూడా చూస్తుంటారు . మనం కలిసి మాట్లాడుకుందాం అని మెసేజ్ పెట్టాను . ఆ తర్వాత మూడు వారాల్లోనే మా నిశ్చితార్థం అయిపోయింది . మా పెళ్లి జరిగి 13 సంవత్సరాలు అవుతుంది ” అంటూ చెప్పుకొచ్చారు దుల్కర్ సల్మాన్ .