నాగచైతన్య - సమంత పెళ్ళిలో జరిగిన ఆ తప్పుని ..శోభిత తో చేయనీకుండా జాగ్రత్త పడుతున్న నాగార్జున..!

Thota Jaya Madhuri
"పెళ్లి".. జీవితంలో ఒకేసారి చేసుకునేది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మాత్రం ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు చేసుకుంటున్నారు . ఫోటోషూట్ ల కోసం కొందరు ..ఆ మోజు కోసం మరి కొందరు ..పని పాట లేక మరికొందరు ..పెళ్లి అన్న పదానికి అర్థమే మార్చేస్తున్నారు.  ఒకప్పుడు పెళ్లి అంటే ఎంత పవిత్రంగా భావించే వారో మనం చూసాం . అసలు ప్రతి పనిని కూడా ఎంతో సాంప్రదాయ బద్ధంగా పెద్దల ఆశీర్వాదంతో చక్కగా జరిపేవారు. ఒకసారి పెళ్లి చేసుకుంటే ఆమెను కానీ ఆయనను కానీ చచ్చే వరకు విడిచి పెట్టే వారే కాదు . బట్ ఇప్పుడు జనరేషన్ మొత్తం మారిపోయింది.  ఒకరిని ప్రేమించడం మరొకరితో నిశ్చితార్ధం చేసుకోవడం ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ..ఇంకా హైలైట్ ఏంటంటే పెళ్లయిపోయి మొగుడు ఉన్నా కూడా ఇంకొకడితో ఆ సుఖాన్నీ పొందడం.. ఇలాంటివి ఎన్నెన్నో చేస్తున్నారు.
మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి . కాగా ప్రజెంట్ సోషల్ మీడియాలో అక్కినేని హీరో నాగచైతన్య -శోభిత  ధూళిపాళ్ల పెళ్లికి సంబంధించిన వార్తలు బాగా బాగా ట్రెండ్ అవుతూ అక్కినేని అనే హ్య్స్ష్ ట్యాగ్ ని బాగా హైలైట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు.  కాగా ఇలాంటి క్రమంలోనే  శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య పెళ్లి జరిపించడం కోసం నాగార్జున చాలా చాలా పక్కాగా ప్లాన్ గా ముందుకు వెళ్తున్నారట.  నాగచైతన్య - సమంతల పెళ్లి కోసం చాలా ఖర్చు పెట్టాడు .. చాలా కష్టపడ్డాడు నాగార్జున.  కానీ ఆ పెళ్లి పెటాకులు అయిపోయింది . తప్పు ఎవరిదో తెలియదు కానీ పెళ్లి మాత్రం డివర్స్ తీసుకునే వరకు వెళ్లి ఇద్దరి జీవితాలను వేరువేరు చేసేసింది .
అయితే శోభితా ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్నాక నాగచైతన్య లైఫ్ బాగుంటుంది అంటూ ఆశ పడుతున్న నాగార్జున ..సమంత - నాగచైతన్య పెళ్లిలో జరిగిన తప్పును శోభిత ధూళిపాళ్ల నాగచైతన్య పెళ్లిలో జరగనీయకుండా జాగ్రత్త పడుతున్నారట.  నిజానికి నాగచైతన్య - సమంత పెళ్లి ముహూర్తం పెట్టింది వేరు.. నాగచైతన్య సమంత మెడలో తాళి కట్టిన ముహూర్తం వేరు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ఫోటోషూట్ పేరిట ముహూర్తాన్ని తలకిందులుగా మార్చేసుకున్నారు అంటూ అప్పట్లో చాలామంది కూడా ట్రోల్ చేశారు .
ఆ కారణంగానే వాళ్ళు డివర్స్ తీసుకున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే నాగార్జున ఇప్పుడు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారట . శోభిత ధూళిపాల - నాగచైతన్య పెళ్లి ముహూర్తానికి మాత్రం అదే టైంలో మెడలో మూడు ముళ్ళు వేసే విధంగా పక్కాగా ప్లాన్ చేస్తున్నారట . అందులో ఏం మాత్రం అటు ఇటు కాకుండా పక్క ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారట . మొదటి పెళ్లిలో జరిగిన తప్పు రెండో పెళ్లిలో జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు నాగార్జున అంటూ జనాలు కూడా ఓ రేంజ్ లో ఆయన డెడికేషన్ ను పొగిడేస్తున్నారు...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: