తారక్ పని క్లోజ్ అయినట్లేనా.. ఇన్నాళ్లకు అసలైన ఎదురుదెబ్బ..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన తాజాగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ దేవర పార్ట్ 1 సినిమా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చాయి. ఇప్పటికే 500 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ విడుదల తర్వాత చాలా సినిమాలు విడుదల అయ్యాయి.

అలా విడుదల అయిన సినిమాలలో ఏదైనా సినిమా అద్భుతమైన టాక్ ను తెచ్చుకున్నట్లయితే దేవర కలెక్షన్లు చాలా వరకు తగ్గుతాయి అని చాలా మంది జనాలు భావించారు. కానీ దేవర సినిమా విడుదల అయిన తర్వాత అదిరిపోయే రేంజ్ టాక్ ను తెచ్చుకున్న ఏ సినిమా విడుదల కాలేదు. దానితో దేవర మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు చాలా రోజుల పాటు సూపర్ సాలిడ్ గా వచ్చాయి. ఇకపోతే నిన్న అనగా అక్టోబర్ 31 వ తేదీన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర క , లక్కీ భాస్కర్ , అమరన్ , భగీర అనే నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి.

ఇందులో క , లక్కీ భాస్కర్ , అమరన్ మూడు సినిమాలకు కూడా బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో చాలా మంది ఈ మూడు సినిమాలకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది ...  వీటికే థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో చాలడం కష్టం. ఇక దేవర సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు రావడం కష్టం. ఇక దేవర సినిమా థియేటర్లలో నుండి తీసివేసే అవసరాలు ఏర్పడతాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: