రష్మిక కి కోపం వస్తే పరిగెత్తుకుంటూ రూమ్ లోకి వెళ్లి అలా చేస్తుందా..? భలే వింతగా ఉందే..!

Thota Jaya Madhuri
మనిషి అన్నాక కోపం రాకుండా ఉంటుందా..? ఎంత మెడిటేషన్లు చేసినా..? ఎన్ని యోగాలు చేసిన..? కొన్ని కొన్ని సందర్భాలలో కోపం ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది . ఉప్పు కారం తినే బాడీ కదా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా కష్టం . కొంతమంది కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నానా రకాల ఎక్సర్సైజులు కూడా చేస్తూ ఉంటారు. కానీ  దేవుడిచ్చిన కోపాన్ని తగ్గించుకోగలమే కానీ పూర్తిగా ఆపలేం . అది ప్రకృతి ధర్మం . అయితే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కొందరు కొన్ని కొన్ని చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు .


మరి ముఖ్యంగా కొందరు నెంబర్స్ ను రివర్స్ గా కౌంట్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది కోపం వస్తే ఎవరితో మాట్లాడకుండా రూమ్ లోకి వెళ్లి పడుకునేస్తారు. మరి కొంతమంది కూల్ గా మెడిటేషన్ చేసుకుంటారు . చాలామంది సినీ స్టార్స్ కూడా ఇదే విధంగా చేస్తారు . అయితే వాళ్ళందరిలోకి డిఫరెంట్ రష్మిక మందన్నా.  రష్మిక మందన్నా కి కూడా కోపం వస్తుంది . ఆమె మనిషే కదా . అయితే కోపం వచ్చినప్పుడు తన కోపాన్ని అరుపులతో కాకుండా చాలా తెలివితో కంట్రోల్ చేసుకుంటుందట .


ఎంతలా అంటే తనకి ఎవరి మీద అయినా కోపం వచ్చినా ఆ సిచువేషన్ హ్యాండిల్ చేయలేకపోయినా .. వెంటనే తనకి నచ్చిన ఫుడ్ తీసుకుని రూమ్ లోకి తీసుకువెళ్లి మొత్తం తినేసి ప్రశాంతంగా ఏసీ వేసుకొని పడుకునేస్తుందట. అప్పుడు ఆమె కోపం కంట్రోల్ అవుతుందట . ఆమె అప్పుడు ఒక టంఘ్ స్లిప్ అయ్యే మాట కూడా ఏమీ మాట్లాడదట. ఆ తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకొని అసలు జరిగిన తప్పు ఏంటి..? ఎలా..? సాల్వ్ చేయాలి అన్న విషయంపై కాన్సెంట్రేషన్ చేస్తుందట . జనరల్ గా ఇలా చాలా తక్కువ మంది మాత్రమే చేస్తుంటారు.  కోపం వస్తే గబగబా నోటికి వచ్చిన మాటలు మాట్లాడటం.. అరవడం తప్పిస్తే కూల్ గా ఉండడానికి ఎవరు కూడా ప్రయత్నించరు. ప్రయత్నించిన అది వర్కౌట్ అవ్వదు . రష్మిక మందన్నా మాత్రం చాలా పక్కాగా తెలివితో మంచి నిర్ణయమే తీసుకుంది . ఈ విధంగా చేస్తే ఎవరి కోపమైనా సరే ఈజీగా కంట్రోల్ అయిపోతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: