వామ్మో: ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి కాకుండానే అత్తారింట్లో పండుగ చేసుకుందా..?

Divya
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన రష్మిక మందన్న.. గురించి ప్రతిరోజు ఏదో ఒక విషయం వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గత కొన్ని ఏళ్లు గా హీరో విజయ్ దేవరకొండతో రహస్య ప్రేమాయణం నడుపుతోందనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే రష్మిక అప్పుడప్పుడు విజయ్ దేవరకొండ ఇంటికి వెళుతూ ఉండడమే కాకుండా విజయ్ దేవరకొండ తో రష్మిక కొన్ని ఫోటోలు కూడా సింక్ అయ్యేలా ఉంటాయి. ఇప్పుడు మరొకసారి రష్మిక కి సంబంధించి మరొక న్యూస్ వైరల్ గా మారుతున్నది.

అదేమిటంటే తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలలో రష్మిక వైట్ దుస్తులలో దీపాలు పట్టుకొని మరి ఆ ఫోజులు ఇచ్చింది.ఈ ఫోటోలను సైతం విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ తీసినట్లుగా ఫోటోలకు క్యాప్షన్ ఇస్తూ ఈ క్రెడిట్ అంతా కూడా ఆనంద్ దేవరకొండదే థాంక్యూ అంటూ క్యాప్షన్ ని రాసుకుంది రష్మిక. దీంతో మరొకసారి నేటిజెన్లకు ఫుల్ స్టప్ ఇచ్చింది రష్మిక.. కొంతమంది నెటిజన్స్ పెళ్లి కాకుండా అని అత్తారింట్లో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నావా రష్మిక అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి రష్మిక దీపావళి పండుగ ఒక సెన్సేషనల్ గా  మారిపోయింది. మరి దీనిపైన అటు విజయ్ దేవరకొండ సోదరుడు లేకపోతే రష్మిక స్పందిస్తుందేమో చూడాలి మరి. నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మిక ప్రస్తుతం పుష్ప-2 సినిమాల నటిస్తూ ఉన్నది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ ఐదవ తేదీన రిలీజ్ కాబోతున్నది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో మరొకసారి బిజీ హీరోయిన్గా మారబోతోంది. ఇదే కాకుండా పలు రకాల లేడీ ఓరియంటెడ్ చిత్రాలే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో కూడా తన హవా చూపించాలని ప్రయత్నాలు చేస్తోంది. మరి మొత్తానికి విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఎలాంటి బంధం ముందు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: