కీర్తి సురేష్ కోరిక తీర్చబోతున్న రామ్ చరణ్.. మా మెగా హీరో ఎంత మంచోడో..?

Thota Jaya Madhuri
రామ్ చరణ్ ..ఎంత మంచి మనసు కలవాడో మనందరికీ తెలిసిందే . సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా రామ్ చరణ్ చాలా చాలా స్టార్ సెలబ్రెటీ అని చెప్పాలి . ఎంతలా అంటే తండ్రి మెగాస్టార్ చిరంజీవి అయినా కూడా చిరంజీవి కొడుకు చరణ్  అనకుండా చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పించుకునే స్థాయికి ఎదిగిపోయాడు . దిన్నంతటి కారణం ఆయన మంచి మనసు . తనకోసం వచ్చిన వాళ్లను ఆప్యాయంగా పలకరించడమే కాకుండా ఫ్యాన్స్ కు చాలా చాలా స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ల బాగోగులు చూసుకుంటూ ఉంటారు . అంతేకాదు రామ్ చరణ్ తన బర్త్డ డే సందర్భంగా ఏ ఫ్యాన్ ఇంటికి వచ్చినా సరే ప్రేమగాపూర్వకంగా ఆప్యాయంగా లోపలికి పిలిచి పలకరిస్తూ సురేఖ వండిన వంటనే పెడుతూ ఉంటారు. అలాంటి సందర్భాలకు సంబంధించిన ఫోటోలు కూడా మనం చూసాం.


కాగా ఇప్పుడు కీర్తి సురేష్ కోరిక తీర్చబోతున్నాడు రామ్ చరణ్ అంటూ ఇండస్ట్రీలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. మనకు తెలిసిందే కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ . వీళ్లిద్దరి కాంబోలో ఒక్క సినిమా అయినా ఎక్స్పెక్ట్ చేస్తారు మెగా ఫాన్స్. అయితే ఎందుకో అది కుదరడం లేదు. గతంలో రంగస్థలం సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సింది వీళ్లు కానీ అది కుదిరినట్లే కుదిరి క్యాన్సల్ అయిపోయింది . ఆ తర్వాత పలు సినిమాలలో ఛాన్స్ వచ్చినా సరే అది ఇంప్లిమెంట్ చేయలేకపోయారు డైరెక్టర్స్ . కాగా కీర్తి సురేష్ నటించిన "గుడ్ లక్ సఖి" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చాడు రామ్ చరణ్ . ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే కీర్తి సురేష్ కి ఒక ప్రామిస్ కూడా చేశారు .


కచ్చితంగా ఆమెకు ఒక సినిమాలో ఛాన్స్ ఉంటుంది అంటూ చెప్పుకు వచ్చారు. ఇన్నాళ్లకు ఆయన ఆ ప్రామిస్ నిలబెట్టుకోబోతున్నాడు . రామ్ చరణ్ - కీర్తి సురేష్ కాంబోలో ఒక సినిమా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది . సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమాలో హీరోయిన్గా సమంత ఫిక్స్ అయినట్లు సమాచారం అందుతుంది . అయితే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద కీలక పాత్ర కోసం  కీర్తి సురేష్ ని కూడా తీసుకోబోతున్నారట . కీర్తి సురేష్ - సుకుమార్ దర్శకత్వంలో నటించబోతుంది అంటూ టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమె పేరు బాగా ట్రెండ్ అవుతుంది.  రామ్ చరణ్ స్వయంగా కీర్తి సురేష్ పేరుని ప్రతిపాదించడం అందరికీ చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . బాలీవుడ్ రేంజ్ బ్యూటీస్ తో రొమాన్స్ చేసే స్థాయి ఉంది రామ్ చరణ్ కి అయినా సరే కీర్తి సురేష్ కి ఇచ్చిన మాట కోసం ఆమెనే సినిమాలో పెట్టుకుంటూ ఉండటం అందరికీ బాగా నచ్చేసింది . దీంతో రాంచరణ్ ..మా మెగా హీరో మంచివాడు అంటూ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: