దీపికా ముద్దుల కూతురు పేరు ఏంటి.. ఆ పేరు వెనుక అంత కథ ఉందా..?

Divya
బాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరుపొందిన దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ 2018లో ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. తమ ఆరేళ్ల వైవాహిక జీవితం ఈ ఏడాది ఒక పండంటి ఆడబిడ్డ జన్మించింది. అయితే ఇప్పటివరకు తన ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు. కానీ దీపావళి పండుగకు సంబంధించి సోషల్ మీడియాలో తమ కూతురి నామకరణ ఫోటోలను షేర్ చేసింది దీపిక, రణబీర్. అలాగే తన కూతురు పేరు కూడా నామకరణం చేసినట్లుగా తెలియజేసింది. వాటి గురించి చూద్దాం.

దీపిక, రణబీర్ కూతురు పేరు" దువా పదుకొనే సింగ్" అంటూ పేరుని నామకరణం చేశారు.. దువా అంటే ప్రార్థన అని మా పేరెంట్స్ కు సమాదానం ఈమె చెబుతుంది అన్నట్లుగా తన చిన్నారి కాళ్ళతో కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది ఈ జంట. దీంతో పలువురు సినీ ప్రముఖులు సైతం, పలువురు అభిమానులు, నెట్టిజెన్స్ సైతం ఈ జంటకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దీపికా పదుకొనే కూతురికి కూడా గ్రాండ్గా వెల్కమ్ తెలుపుతూ ఉన్నారు. మరి కొంతమంది క్యూట్ అండ్ లవ్ ఎమోజిలను సరిత షేర్ చేస్తూ ఉన్నారు.

దీపికా పదుకొనే, రణబీర్ సింగ్ ఇద్దరు కూడా ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా తమ హవా చూపించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది కల్కి చిత్రంతో అందర్నీ మెస్మరైజ్ చేసిన దీపిక ఏకంగా ఈ సినిమాతో రూ .1100 కోట్ల మేరకు షేర్ని రాబట్టింది. ఇటీవల దీపావళి సందర్భంగా సింగం అగైన్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది దీపిక. నిన్నటి రోజున ఈ సినిమా చాలా గ్రాండ్ గా విడుదల అయింది. మొత్తానికి దీపిక రణబీర్ కూతురు పేరు మాత్రం అందరిని బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: