వితికా నడుము వల్లే వరుణ్ సందేశ్ లవ్ లో పడ్డారా.. షూటింగ్లో అంత పెద్ద తప్పు చేశారా.?

Pandrala Sravanthi
- పడ్డానండి ప్రేమలో మరి నుండి మొదలు..
- పెళ్లి వరకు వెళ్లిన లవ్ స్టోరీ..
- వరుణ్ వితికల ప్రేమ ముచ్చట్లు..

 సాధారణంగా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీలు అనేవి ఉంటాయి. ఈ స్టోరీల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో వరుణ్ సందేశ్ మరియు వితికాషేరు పేర్లు మాత్రమే.. అలా మొదలైన వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లి అన్యోన్యమైన జంటగా పేరు తీసుకువచ్చింది. అలాంటి వీరి లవ్ స్టోరీ ఎలా మొదలైంది అనే ఆ వివరాలు చూద్దాం..
 లవ్ స్టోరీలో ట్విస్ట్ లెన్నో?

 హ్యాపీడేస్,కొత్త బంగారులోకం చిత్రాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో వరుణ్ సందేశ్.ఈ సినిమాల తర్వాత పలు చిత్రాలు నటించిన అవి ఫ్లాప్ అవడంతో వరుణ్ కాస్త డల్ అయిపోయారు. ఇక వీటి తర్వాత ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అలా చేస్తున్న తరుణంలోనే పడ్డానండి ప్రేమలో మరి అనే మూవీలో  నటించారు వరుణ్ సందేశ్. ఇందులో హీరోయిన్ గా వితికా షెరు నటించింది. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.. పడ్డానండి ప్రేమలో మరీ మూవీ షూటింగ్ సమయంలో  మాత్రమే మేము ఒకరినొకరు చూసుకున్నాం. మేము పర్సనల్ గా మాట్లాడుకోవడానికి కొన్ని నెలలే పట్టింది. అతను కాస్త గుర్తింపు ఉన్న హీరో కాబట్టి ఆయనతో మాట్లాడడానికి కాస్త టైం తీసుకున్నానని వితికా తెలియజేసింది. అంతేకాదు వరుణ్ ఎక్కువగా అమ్మాయిలతో మాట్లాడడానికి ఇష్టపడడు.  అంతే కాకుండా నేను అప్పుడే యూఎస్ నుంచి వచ్చాను. ఇలా షూటింగ్లో భాగంగా కారు ప్రయాణం  ఉంటుంది.

వారికి కెమెరా ఫిక్స్ చేసి పెట్టారు మేమిద్దరమే కారులో ప్రయాణించాలి. అలా పోతున్న సమయంలో ఏం మాట్లాడాలో తెలియక  అమెరికాలో మీరు ఏం చేసేవారు  మీ ప్రయాణం ఎలా సాగింది అంటూ ఒకరికొకరం మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాం.  అలా మొదలైన మా మాటలు షూటింగ్ షెడ్యూల్ పూర్తయ్య సరికి ప్రేమకు దారి తీసింది. అంతేకాదు ఈ షూటింగ్ సన్నివేషాల్లో ఒక అనూహ్యమైన ఘటన కూడా జరిగిందట. ఇందులో వరుణ్ నన్ను ఎత్తుకొని పరిగెత్తవలసి ఉంటుంది. ఇదే సమయంలో అనుకోకుండా బ్యాలెన్స్ తప్పి కింద పడేశాడు. ఆయన నాపై పడిపోయాడు.  ఈ టైంలోనే నా నడుముకి బలమైన దెబ్బ తగిలింది. నాకు దెబ్బ బాగా తగిలిందేమో అనుకొని వరుణ్ చాలా భయపడిపోయి ప్రతి రోజు ఎలా ఉంది ఆరోగ్యం అని ఫోన్ చేసేవాడు.  ఆ విధంగా మా ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ మొదలై పెళ్లి వరకు వెళ్ళింది. అలా 2016లో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అంటూ వితిక, వరుణ్ లు ఓ  ఇంటర్వ్యూలో చెప్పారు.అలా ఇద్దరు ఒకే సినిమాలో హీరో హీరోయిన్ గా చేసి చివరికి ప్రేమలో పడి వివాహం ద్వారా ఒక్కటయ్యారు. ఈ జంట బిగ్ బాస్ 3 లో సందడి చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: