ఏంటి సదా సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా.. పెళ్లి చేసుకోబోయిందా..అసలు నిజం ఏంటి..సదా జీవితంలో నిజంగానే అలాంటి ఓ సంఘటన జరిగిందా అనేది ఇప్పుడు చూద్దాం.. 40 ప్లస్ వయసు వచ్చినా కూడా హీరోయిన్ సదా పెళ్లి చేసుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.కొంతమంది ఏమో ఆమెకు నచ్చిన వరుడు దొరకడం లేదంటే, మరికొంత మందేమో ఆమెకు బ్రేకప్ జరగడం వల్లే పెళ్లి మీద నమ్మకం పోయింది అంటారు. కానీ సదా మాత్రం తన మనసుని అర్థం చేసుకునే వాడు దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెబుతోంది.అయితే ఇప్పటికే 40 ఏళ్ళు దాటడంతో సదా పెళ్లిపై ఇంట్లో ఒత్తిడి అయితే పెరిగిపోతుందట. ఇక ఈ విషయం పక్కన పెడితే.. అప్పట్లోనే సదా ఓ హీరోని సీక్రెట్ గా పెళ్లి చేసుకోబోతుంది అంటూ తమిళ మీడియాలో తెగ ప్రచారం జరిగింది.
అయితే ఈ ప్రచారానికి తెరదించే ప్రయత్నం ఎవరూ చేయలేదు.అసలు విషయం ఏమిటంటే..ఓ తమిళ హీరోతో సదా సినిమా చేసే సమయంలో ఆ హీరోతో ప్రేమలో పడిపోయింది అనే టాక్ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే విచిత్రం ఏమిటంటే.. సదా ప్రేమించిన హీరోకి అప్పటికే పెళ్లయిపోయిందట. అయితే సదా ఆ హీరో కి పెళ్లి అయింది అనే నిజం తెలిసినా కూడా ఆయన్ని వదిలేసుకోవడానికి ఇష్టపడలేదట.అంతేకాదు ఆ హీరో కూడా సదా తో చాలా రోజులు రిలేషన్ మెయింటైన్ చేశారట.
ఇక సదాతో ఆ హీరో తిరగడం ఇంట్లో వాళ్లకు తెలిసి ఇంట్లో భార్య పెద్ద పెంట చేసిందట. ఇక ఈ బాధంతా నాకెందుకు అని సదా కి బ్రేకప్ చెప్పాలి అనుకున్నారట ఆ తమిళ్ హీరో.కానీ సదా మాత్రం నువ్వు నాకు బ్రేకప్ చెబితే నేను సూసైడ్ చేసుకుంటాను అని బెదిరించి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందామని డేట్,టైం ఫిక్స్ చేసిందట. కానీ చివరికి ఆ హీరో మాత్రం సదా కి హ్యాండ్ ఇచ్చి నాకు నా కుటుంబమే కావాలి అని సదా కి బ్రేకప్ చెప్పారట.ఇక బ్రేకప్ తో సదా మనసు ముక్కలైపోయింది. దాంతో ఇప్పటివరకు పెళ్లి చేసుకోవడం లేదు అని తెలుస్తోంది. అయితే ఈ రూమర్ చాలా రోజులుగా వినిపించినప్పటికీ సదా మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు