నెటిజన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన మృణాల్.. ఇలా చేయడం పద్ధతి కాదంటూ?

Reddy P Rajasekhar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన మృణాల్ ఠాకూర్ సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకోగా ది ఫ్యామిలీ స్టార్ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ విషయంలో జరిగిన పొరపాట్లు ఈ సినిమా ఫెయిల్యూర్ కు కారణమని చెప్పవచ్చు. అయితే ఎప్పుడూ కూల్ గా ఉండే మృణాల్ ఠాకూర్ నెటిజన్ పై ఫైర్ కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
 
అయితే సౌఖిల్ అనే నెటిజన్ దీపావళి పండుగ సందర్భంగా మృణాల్ ఠాకూర్ తో కలిసి దీపావళి పండుగను జరుపుకొంటున్నట్టు ఎడిట్ చేశాడు. అయితే ఎడిట్ చేసిన ఈ ఫోటో మృణాల్ ఠాకూర్ దృష్టికి వచ్చింది. ఆ ఫోటో గురించి మృణాల్ ఠాకూర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సౌఖిన్ ఫోటో పోస్ట్ చేయడంతో పాటు "దీపావళి ఫోటో ఎడిటింగ్.. బాలీవుడ్ నటి ఫోటోషూట్" అని పేర్కొన్నారు.
 
మృణాల్ ఠాకూర్ రియాక్ట్ అవుతూ బ్రదర్.. మీకు మీరే ఎందుకు తప్పుడు భరోసా ఇచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. మీరు చేసిన పని బాగుందని అనుకుంటున్నారా అని ఆమె కామెంట్లు చేశారు. ఇది ఏ మాత్రం బాలేదని ఆమె తెలిపారు. నెటిజన్లు సైతం మృణాల్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఆ నెటిజన్ చేసిన పని కరెక్ట్ కాదని వెల్లడిస్తున్నారు.
 
ఈ ఏడాది ఏప్రిల్ నెల 5వ తేదీన ది ఫ్యామిలీ స్టార్ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో రిచ్ అమ్మాయిగా మృణాల్ ఠాకూర్ నటించడం గమనార్హం. మృణాల్ ఠాకూర్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. మృణాల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. మృణాల్ ఠాకూర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: