ప్రభాస్తో సందీప్ రెడ్డి ప్లానింగ్ మామూలుగా లేదుగా.. ఈసారి థియేటర్లో పగిలిపోవాల్సిందే..!
ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నాడు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో లేదంటే 20026 సమ్మర్లో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగా సినిమా అంటే హీరోలు ఎంతో గట్టిగా ప్రిపేర్ అయి సినిమా కోసం ముందుకు రావాలి. ఇప్పుడు స్పిరిట్ కోసం ప్రభాస్ కూడా చాలానే కష్టపడుతున్నారని అంటున్నారు. ఇక సందీప్ రెడ్డి ఈ సినిమా కోసం ఎవరూ ఊహించని ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడని.. అలాగే హాలీవుడ్ స్టార్లను రంగంలోకి దించబోతున్నాడని కూడా అంటున్నారు. ఇదే సమయంలో ఒక వార్త ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు మెంటల్ లెక్కిస్తుంది. సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన ఓ అప్డేట్ టాలీవుడ్ - బాలీవుడ్ ను దడ పుట్టిస్తుంది. స్పిరిట్ సినిమా కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేయబోతున్నారట.
ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ లో ఇద్దరూ వర్క్ చేస్తారట.. సెకండ్ హాఫ్ కోసం మరో ఇద్దరు వర్క్ చేస్తారట. పాటల కోసం సపరేట్గా ఇద్దరు , బ్యాగ్రౌండ్ స్కోర్స్ కోసం ఇద్దరు వర్క్ చేస్తున్నట్టు టాక్ ... ఇప్పటికే సినిమా మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ అయిందని అంటున్నారు. ఇదే విషయాన్ని ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ల ఒక్కరైనా హర్షవర్ధన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ లో… సందీప్ రెడ్డి వంగా ట్యూన్ ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు ఈ ఫోటో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ లు ఈ సినిమా కోసం వర్క్ చేయడం అంటే కచ్చితంగా థియేటర్లు బద్దలు అయినట్టే అంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ ప్రెజెంట్ చేసే ప్రాజెక్ట్ లు కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా కోసం వర్క్ స్టార్ట్ చేస్తాడు. అయితే ఇప్పటి నుంచే గడ్డం భారీగా పెంచుతున్నట్టు టాక్.