ఈ రష్మిక మందన్నా నటిస్తుందా..? నమ్మిస్తుందా..?

Thota Jaya Madhuri
ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో రష్మిక మందన్నాను తెగ ట్రోల్ చేసేస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా రీసెంట్గా ఆమె జరుపుకున్న దీపావళి సెలబ్రేషన్ తాలూకా పిక్చర్స్ ఆమెకు కొత్తగా తలనొప్పులు క్రియేట్ చేశాయి . ఈ మధ్యకాలంలో రష్మిక ఒక స్టార్ హీరో ఫామ్ హౌస్ లో సందడి చేసిన పిక్స్ బాగా వైరల్ గా మారాయి.  అయితే రష్మిక మందన్నాను చాలామంది జనాలు బాగా ట్రోల్ కూడా చేశారు . నువ్వు నీ పబ్లిసిటీ కోసం నీ క్రేజ్ కోసం మనుషుల జీవితాలతో ఆడుకుంటావా..? అంటూ దారుణంగా కూడా కామెంట్ చేశారు.  దానికి కారణం ఆమె విజయ్ దేవరకొండను ప్రేమిస్తుంది అని వార్తలు రావడమే . చూడడానికి జంట చక్కగా ఉంటుంది.  వీళ్ళు ప్రవర్తించే తీరు కూడా అలాగే ఉంటుంది . దీంతో వీళ్ళు  ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి .


అయితే ఆ వార్తలు పై మాత్రం వీళ్లు ఎప్పుడు కూడా నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదు . అలా అని పాజిటివ్ కూడా రియాక్ట్ అవ్వలేదు . దీంతో ఈ వార్తలు నిజమే అంటూ చాలా మంది భావించారు . అయితే రష్మిక బాలీవుడ్ బాడా హీరో ఫామ్ హౌస్ లో కనిపించడం అభిమానులకి మింగుడు పడటం లేదు. ఆ హీరో ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నావ్..? అంటూ చాలా దారుణంగా మాట్లాడారు. అయితే రీసెంట్గా రష్మిక దివాళి సెలబ్రేషన్స్ విజయ్ దేవరకొండ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నట్లు ఆమె షేర్ చేసిన ఫొటోస్ ఆధారంగా తెలుస్తుంది .  ఆమె దిగిన ఫోటోకి క్రెడిట్ విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండకు ఇచ్చింది. " థాంక్యూ ఆనందా" అంటూ నోట్ రాసుకు వచ్చింది .


దీంతో విజయ్ దేవరకొండ ఇంట్లోనే రష్మిక మందన్నా.. దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంది అంటూ మాట్లాడుతున్నారు జనాలు. అయితే మా మధ్య ప్రేమ దోమ ఏమీ లేదు అంటూనే వీళ్ళు ప్రతి పండుగను ప్రతి మంచి శుభకార్యాలను ఒకే ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఏంటి ..? అసలు రష్మిక కి విజయ్ అంటే ప్రేమ ఉన్నట్టా లేనట్టా..? లేక నటిస్తుందా..?  లేదు మా మధ్య ప్రేమ ఉంది అని జనాలను నమ్మిస్తుందా..? ఏంటో రష్మిక చేసే పనులు అర్థం కావడం లేదు అంటూ జనాలు ఆమెను బాగా ట్రోల్ చేస్తున్నారు.  ప్రేమ ఉంది అంటే ఉంది అని చెప్పాలి.. మేము ప్రేమించుకుంటున్నామని చెప్పేయాలి ప్రేమించుకోవడం లేదు అంటూ ఇలా  పెళ్ళికి ముందే ఒకే ఇంట్లో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటే దానికి అర్థం ఏంటి ..? అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . కొంతమంది ప్రేమకు అర్ధాలే వేరులే వాళ్ళు ప్రేమించుకుంటున్నారు .. ఆ విషయాన్ని తర్వాత చెప్పొచ్చు.. ఇప్పుడు తొందరేముంది లైఫ్ లో సెటిల్ అవ్వనివ్వండి అంటున్నారు.. రష్మిక - విజయ్ దేవరకొండ ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: