భారీగా పెంచేసాడుగా.. అమరన్ కోసం శివ కార్తికేయన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
దేశం కోసం ప్రాణాలు అర్పించి వీరమరణం పొందిన మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథ ఆధారంగా అమరన్ మూవీ తెరకెక్కింది. అయితే ఈ మూవీలో ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ ఆయన భార్య ఇందూ రేబాక వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించారు. ఈ మూవీని తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయగా మంచి ఓపెనింగ్స్ సాధించి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమా కోసం శివ కార్తికేయన్ బాగా కష్టపడ్డాడు. ఎప్పుడూ లేనివిధంగా బాడీ పెంచి ఏకంగా సోల్జర్ లాగా ఫిట్‌గా మారిపోయాడు. అయితే ఈ సినిమాతో శివకార్తికేయాన్ హిట్టు కొట్టడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
కాగా ఇక శివ కార్తికేయన్ అమరన్ మూవీ కోసం ఎంత పారితోషకం తీసుకున్నాడు అన్నది వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేశారట నిర్మాతలు. అయితే ఈ మూవీ కోసం శివ కార్తికేయన్ భారీగానే రెమ్యూనరేషన్ పుచ్చుకున్నాడట. అమరన్ మూవీ కోసం సాయి పల్లవి మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటే.. శివ కార్తికేయన్ ఏకంగా ఈ సినిమాకి 30 కోట్ల పారితోషికం అందుకున్నాడట. సాధారణంగా ఒక్కో సినిమాకి 15 నుంచి 20 కోట్లు మాత్రమే తీసుకునే శివకార్తికేయన్ ఇక ఈ సినిమాకి 30 కోట్లు అందుకోవడంతో ఇక భారీగానే పారితోషకం పుచ్చుకున్నాడు అంటూ ఒక వార్త వైరల్ మారింది. న్యాచురల్ యాక్టర్ సాయి పల్లవి సినిమాలో ఉన్నప్పటికీ అటు శివ కార్తికేయన్ ఈ సినిమాలో వన్ మ్యాన్ షో చేసి అదరగొట్టాడు అని చెప్పాలి.