ఈ అక్టోబర్లో టాలీవుడ్ కి అలాంటి రిజల్ట్.. చివరికి మాత్రం మెరుపులు..?

RAMAKRISHNA S.S.
గత రెండు సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి అక్టోబర్ నెల పెద్దగా కలిసి రావడం లేదు. పోయిన సంవత్సరం అక్టోబర్లో విడుదల అయిన భగవంత్ కేసరి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో అనేక సినిమాలు విడుదల అయ్యాయి. భారీ అంచనాల నడుమ విడుదల అయిన స్వాగ్ మూవీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇక ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ నెలలో విశ్వం , జనక అయితే గనక , వెట్టయన్ అనే సినిమాలు విడుదల అయ్యాయి. ఈ మూడు సినిమాలలో ఏ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

అలా దసరా సీజన్ అంత వృధాగానే పోవడంతో సెప్టెంబర్ లో విడుదల అయిన దేవర సినిమానే దసరా సీజన్ కలెక్షన్లను కూడా రాబట్టేసింది. ఇక ఆ తర్వాత పొట్టేలు సినిమా కాస్త అంచనాల నడుమ విడుదల అయ్యి పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్లను మాత్రమే వసూలు చేయగలిగింది. ఇక అక్టోబర్ 31 వ తేదీన మాత్రం దీపావళి పండుగ సందర్భంగా మంచి అంచనాల నడుమ క , లక్కీ భాస్కర్ , అమరన్ భగీర అనే నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి.

ఇందులో తెలుగు సినిమాలు అయినటువంటి క , లక్కీ భాస్కర్ మూవీలకు అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక తమిళ డబ్బింగ్ సినిమా అయినటువంటి అమరన్ మూవీ కి కూడా మంచి టాక్ వచ్చింది. కన్నడ డబ్బింగ్ సినిమా అయినటువంటి భగీర కు మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చింది. మరి మంచి హిట్ టాక్ ను తెచ్చుకున్న మన రెండు తెలుగు సినిమాలు క మరియు లక్కీ భాస్కర్ ఎలాంటి కలెక్షన్లు  వసూలు చేసి ఏ స్థాయి విజయాలను అందుకుంటాయో తెలిస్తే ఈ సంవత్సరం అక్టోబర్ రిజల్ట్ క్లారిటీగా తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: