వైరల్: నెటిజన్ చేసిన పనికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మృణాల్.!

FARMANULLA SHAIK
యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్'సీతారామం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఇందులో సాంప్రదాయంగా నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.ఆ తర్వాత 'హాయ్ నాన్న' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని వరుస ఆఫర్లు అందుకుంది. అయితే ఇటీవల మృణాల్ విజయ్‌తో 'ఫ్యామిలీ స్టార్' చిత్రంలో నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఊహించినంత హిట్ అందుకోలేకపోయింది.ప్రజెంట్ మృణాల్ పూజా మేరీ జాన్, హై జవానీ తో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్-2, తుమ్ హీ హో వంటి చిత్రాల్లో నటిస్తోంది.ఇదిలావుండగా సోషల్ మీడియాలో హీరో హీరోయిన్లపై ట్రోలింగ్ అనేది సర్వసాధారణంగా మారింది. మామూలుగానే తమ అభిమాన హీరో గాని, హీరోయిన్ గాని కనిపిస్తే వెంటనే వాళ్ళతో కలిసి వీలైతే ఒక్క సెల్ఫీ తీసుకోవాలని హడావిడి చేస్తూ వుంటారు అభిమానులు.కానీ కొన్నిసార్లు ఆ అభిమానం హద్దులు దాటి సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే వరకు వెళ్తుంది. తాజాగా ఇలాగే తనను ఇబ్బంది పెట్టే విధంగా ఓ నెటిజన్ ఎడిట్ చేసిన ఫోటోపై సీరియస్ అయింది మృణాల్ ఠాకూర్.అసలేం జరిగిందంటే దీపావళి సందర్భంగా మృణాల్ ఠాకూర్  హీరోయిన్ గా నటించిన “ది ఫ్యామిలీ స్టార్” మూవీ పోస్టర్ ను ఎడిట్ చేశాడు. ఊరికే ఇది చేస్తే పర్లేదు కానీ అందులో విజయ్ దేవరకొండ ప్లేసులో తన మొహాన్ని రీప్లేస్ చేసి, అతను మృణాల్ ఠాకూర్ తో సన్నిహితంగా ఉండి దీపాలు వెలిగించినట్టుగా ఉంది ఆ ఫోటో. ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోను షేర్ చేస్తూ ఆ ఫోటోకి ‘దీపావళి ఫోటో ఎడిటింగ్.. బాలీవుడ్ నటి ఫోటోషూట్’ అని రాసుకొచ్చాడు.
అయితే అది మృణాల్ ఠాకూర్ కి కనపడడంతో ఆమె అసహనం వ్యక్తం చేసింది. వెంటనే సదరు నెటిజన్ పోస్ట్ కు రిప్లై ఇస్తూ మండిపడింది. “బ్రదర్… మీకు మీరే ఎందుకు ఇలా తప్పుడు భరోసా ఇస్తున్నారు? మీరు చేసిన పని బాగుందని అనిపిస్తోందా? ఇది కరెక్ట్ కాదు” అంటూ మృణాల్ ఠాకూర్ అసహనాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఒక్కసారిగా సదరు వ్యక్తి చేసిన పోస్ట్ వైరల్ కావడంతో దీనిపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా మృణాల్ అభిమానులు అలా చేయడం కరెక్ట్ కాదంటూ ఆ వ్యక్తిపై ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: