నందమూరి
బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి అదిరిపోయే రేంజ్ విజయాలను ఎన్నింటినో
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మన తెలుగు హీరోలు ఎక్కువ శాతం పాన్
ఇండియా సినిమాల వైపు దృష్టి మళ్లిస్తున్న విషయం మనకు తెలిసిందే. కేవలం తెలుగు లో విడుదల చేయడం ద్వారా సినిమాలకు పెద్ద మొత్తంలో కలెక్షన్లు రావు. అదే తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాను విడుదల చేయడం వల్ల ఆ
మూవీ కి గనుక మంచి టాక్ వచ్చినట్లయితే పెద్ద మొత్తంలో కలెక్షన్లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. అలాగే
హీరో క్రేజ్ కూడా దేశ వ్యాప్తంగా పెరిగే అవకాశం ఉంటుంది.
దానితో చాలా మంది హీరోలు , దర్శకులు , నిర్మాతలు పాన్
ఇండియా సినిమాలపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి
మెగాస్టార్ చిరంజీవి "సైరా నరసింహా రెడ్డి"
మూవీ ని తెలుగు తో పాటు
తమిళ్ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇదే రూట్ లోకి
బాలయ్య కూడా వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.
బాలయ్య తన నెక్స్ట్
మూవీ ని
బోయపాటి శ్రీను తో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.
వీరి కాంబోలో రూపొందబోయే
మూవీ అఖండ
మూవీ కి కొనసాగింపుగా తేరకేక్కబోతుంది. ఇకపోతే ఈ సినిమాలు తెలుగు తో పాటు
తమిళ్ ,
కన్నడ , మలయాళం ,
హిందీ భాషలలో పాన్
ఇండియా మూవీ గా విడుదల చేయాలి అని
బోయపాటి ఫిక్స్ అయినట్లు , ప్రస్తుతం ఆయన ఆ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతానికి అఖండ 2
మూవీ పై
బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.